పుట:Neti-Kalapu-Kavitvam.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

వైరస్యానికి హేతువులు తెలిపినాను. నేటికాలపుకావ్యాల్లో అందులో ఇంగిలీషుసంపర్కం తగిలినకావ్యాల్లో యీ అనౌచిత్య దోషం హెచ్చుగా కనబడుతున్నది. యెంకిపాటలు మొదలైనవాట్లో అనౌచిత్యం కనబడుతున్నది. అనౌచిత్యం వివరిస్తాను. యెంకయ్య చంద్రమ్మ పాట మొదలైనవాటికి యీవిచారణను అన్వయించుకోవలెను. నాయుడుబావ తోట వ్యవసాయం మొదలైనవి చేసుకునే ఒకజానపదుడు. గురుజనసేవ, విద్యాగోష్ఠి యిట్లాటివల్ల కలిగిన సంస్కారంలేనివాడు.

"రామకుష్టా యని
 సీకటై పోవాలి"
"గోవుమా లచ్చిమి"
"జాము రాతిరియేళ
 సెందురుణ్ణీ తిట్టు
 సూరి యుణ్ణీ తిట్టు
 కూకుండనీదు"

అని నాయుడు మాట్లాడుతాడు సంస్కారంగలవాం డ్లెవ్వరూ ఇట్లా మాట్లాడరు. రామకృష్ణా అని, చీకటై, మహాలక్ష్మీ,మాలక్ష్మీ, జామురాత్రివేళ, చందురిణ్ణి, సూర్యుణ్ణి కూచోనియ్యదు అని యీతీరున అంటారు. చదువుకోని కమ్మకుమ్మరి మొదలైన తెగలవారు పైవిధంగా మాట్లాడుతారు. ఆకోటిలోనివా డితడని కృతి తెలుపుతున్నది. పైమాటలవల్ల చదువు మొదలైనవాటివల్ల కలిగె సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది.

"తోటకాడేవుండు తొరగొస్త
 నీకోసరమె సెవుతాను.
 వొంకపోగానె మావోడొస్తడమ్మా
 అద్దములో సూత్తుంటె
 సెందురూడా