పుట:Neti-Kalapu-Kavitvam.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

211


మద్దెసెంద్రుడెమనకు పెద్దమనిసి
సుక్కెక్కడున్నాదొ."

అని యీతీరున నాయుడిమాటల రకపుమాటలే మాట్లాడే ఈయెంకికూడా చదువు మొదలైనవాటివల్ల కలిగే సంస్కారంలేని మనిషి అని స్పష్టమవుతున్నది ఇట్లాటి అపరిణతుడికీ

"ఒక్క నేనే నీకు నాయెంకీ
 పెక్కు నీవులు నాకు నాయెంకీ.
 ఇన్నిపొంకాలున్న యెంకివే నీవు
 ఇంత నాగుండెలో యిమిడిపో లేదా
 మాటలో మనసులో మంచిలో యెంకి
 సొగసు నీదోసారె అగపడవనాకు"

అనేమాటలు అనుచితం అని ఆపాత్రలదశకు తగనివి. దేశకాలవస్థాప్రకృతులకు విరుద్ధంగావున్నవి. కనుకనె అనౌచిత్యమంటున్నాను. ఇట్లానే నాయుడికోటిలోనే చేరి పరిపాకం లేని నాయికకు

"గాలికైనా తాను కౌగిలీనన్నాడు"
"వోసూపె వోరూపె వోనవ్వెరాజా
 యిన్నింట పోవాలె యెటుసెదిరినాదొ
 అద్దములో నారాజ అంతనీరూపు
 ఇంత ముత్తెములోన ఇరికె నేలాగు"

అనేవి అనుచితాలు. ఈ విషయంలో సహృదయుల అంతఃకరణమే ప్రమాణం. ప్రాకృతులకు పరిణతులకు స్ధూలరూపంలో భేదం యెట్లావున్నా మనః పరిణతిలో మటుకు ప్రస్పుటభేధం వ్యక్తమవుతున్నది. జలం యొక్క ద్రవశిలావాతావస్థలు మెరుపులు మొదలైన భౌతికపరిణామాలు, వాక్కు, వాగ్విశేషాలు అంతఃకరణవృత్తిలీలలు ఇవన్నీ ప్రాకృతులకు అజ్ఞాతంగా గోచరిస్తున్నా స్థూలదృష్టితో