పుట:Neti-Kalapu-Kavitvam.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనౌచిత్యాధికరణం

209


ఆదేవదూత అంతటివాడు. భారతవర్షకథలో ఇట్లాటి అవివేకి సన్యాసులను చెప్పడం అవివేకం. ఇంతకూ విచారిస్తే వీరు బారతవర్షీయులు కారని తెలిసింది. ఆంగ్లభాషలో హర్మిటును జూచి వ్రాశానని కృతికర్త వ్రాశాడు. పాశ్చాత్యసన్యాసులకు పాశ్చాత్యనామాలేవుంచి వారిని ఆదేశస్థులుగానే చెప్పితే ఉచితంగా వుండేది ఇట్లాటి సన్యాసులవర్ణించిన ఆదేశపు పార్నెలుకవి అనౌచిత్యానికి పాలుగాలేదు. కాని వనవాసికర్త బ్రహ్మ విజ్ఞానంతో విలసిల్లిన నైమిశారణ్యాలవంటి భారతవర్షపు అరణ్యాలను భారతవర్షపు నామాలను ఆయూరోప్పాత్రలకు తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుకావించాడు. ఈదేవదూతా పావకుడా తుషాదుడి యింటికి ఆతిధ్యానికిపొతే వీండ్లిద్దరినీ వంట యింట్లోకిబంపి మెతుకులు మీ అంతట మీరు గీరుకొని తిని నీళ్లుదాగిపోండి అని సేవకుణ్ని వారికి కావలిపంపుతాడు. పదినిమిషాలే తిననియ్యవలెను. పదకొండవనిమిషాన వాండ్లను బైటికి సాగనంపవలెను అని అంటాడు. భోజనంచేసేటప్పుడు కొంద రాలస్యంగా తింటారు. కొందరు తొందరగా తింటారు. నెయ్యి యెక్కడవున్నదో మజ్జిగ యెక్కుడవున్నవో యెట్లా తెలుస్తుంది. ఇట్లాటి ఆతిథ్యం భారతీయులకు అత్యంతం అనుచితం. పాశ్చాతుల్లో రొట్టె ముక్కలు మొదలైనవి అబల్లమీదనె పడివుంటవి ఆబల్లమీదనే గ్లాసుల్లో నీళ్ళుంటవి గనుక యిది సరిపోతుంది కాని దీన్ని బారతీయపాత్రలకు తగిలించడం ఉచితంగాదు. కథలు తర్జుమా చేయవచ్చును. కాని యీతీరుగా గాడిదెకు యెద్దుతోక తగిలించి నట్లు పాశ్చాత్యజీవితానికి భారతవర్షనామాలను స్థలాలను తగిలించి కావ్యాన్ని అనౌచిత్యం పాలుచేయడం వివేకంమాలినపని.

వేంకటపార్వతీశ్వరుల మాతృమందిరం, శ్రీరాం రామబ్రహ్మకృతి వాసంతిక యిట్లానే దేశకాలాలతో సంబంధం లేకుండా అనౌచిత్యం పాలౌ వైరస్యాన్ని కలిగిస్తున్నవి.