208
వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
ఇట్లానే షేక్సిపియరునాటకాల్లో తండ్రినితప్ప పరపురుషుణ్ని యెరగకుండా వున్న ఒక కన్య కధ వున్నది. అనుకరించవలననే వుత్సాహంతో వనకుమారికర్తకు వివేకంపోయింది. ఇట్లానే మరికొందరు పాశ్చాత్యులను మొదలైనవారికవి అనుకంచబోయి పులుముడు అయోమయంఅ చిల్లరశృంగారం వీటితొ కూడిన క్షుద్ర్తకృతులు రచించారు. వనకుమారికర్త కావ్యాన్ని అనౌచిత్యంపాలుచేశాడు. దీంట్లో పాత్రలు ఒకరితోనొకరు మాట్లాడేటప్పుడు యేకాంతంగా మాట్లాడేటప్పుడు ఆఅవస్ధకు అప్రకృతికి తగని అనౌచిత్యాలింకావున్నా గ్రంధవిస్తరభీతిచే చర్చించక వదులుతున్నాను. కూచినరసింహకృతి వనవాసిలో పాచకుడు బాల్యంగడవగానే వనంలోకి పోయి సన్యాసిఅవుతాడు. ఇతడికి మర్రిచెట్టుకు చిన్నకాయలుంటే ఆసంగతిగురించి జిజ్ఞాస ఆరంభిస్తాడు. చిరకాలంనుండి ఉపనిషత్త్కర్తలు బాదరాయణుడు బోదాయనుడు బారతవర్షారణ్యాలను బ్రహ్మతేజస్సుతొ నింపిన యెందరొ మహాతపశ్శాలులు తెలిపిన కర్మతత్వం బ్రహ్మతత్వం జీవాత్మ పరమాత్మల బేదాబేదం శమదమాది వైరాగ్య సాధనసంపత్తీ యివన్నీ జగద్విదితమై వుండగా యీసన్యాసి అవన్నీ తెలియక లావుకాయ యెందుకు పుట్టలేదనే వేదాంతవిచారణం చేస్తున్నాడు. ఇట్లాటిదాన్నేచొప్పదంటు శంక అని మన ఆంధ్రదేశపువిజ్నులు అంటారు. గురువు శిష్యుడికి ఉపదేశిస్తుంటే అదంతావినక బర్రెదూడ చొప్పదంటుతినడంచూచి యింతపొడగుదంటు ఆ కాస్త దూడకడుపులొ యెట్లాపడుతుందని శ్ంకించాడట. ఈమర్రికాయశంక అరకంలోనే చేరుతున్నడీ. ఈసన్యాసి లవుకాయలేకాస్తే మనుషుల మీదపడి చావరా అని మర్రికాయశంకకు దేవదాత సమాధానంఇ చెప్పుతాడుకాని లావాటికాయలు కాసే పెద్దచెట్లెన్నో వున్నవి బెజవాడలొ గవర్నరుపేట రోడ్దుమీద వీటిని చూడవచ్చును. కొబ్బరిచేలకు లావాటికాయలున్నవి ఈ సన్యాసి యెంతటివాడో