పుట:Neti-Kalapu-Kavitvam.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


207

అనౌచిత్యాధికరణం

వనకుమారి అనే ఖండకావ్యంలో ఒకక్షత్రియుడు రాజ్యం గోలుపోయి అడవిలో తనకూతురితో నివసిస్తుంటాడు. తండ్రిని తప్ప ఆపిల్ల మరి యేపురుషుణ్ని యౌవనం వచ్చేదాకా యెరగదు ఆపిల్ల గొర్రెలుకాస్తూ కొండలోయల్లో తిరుగుతుంటే ఒకక్షత్రియకుమారుడు కనబడతాడు తరువాత కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడుతారు. వనకుమారి తండ్రి చచ్చి పడివున్నసమయాన వనకుమారి ఒకపక్కన నిద్రిస్తుంటే యాక్షత్రియుడు

    "పరసీలోలతరంగడోలల శరచ్చంద్రాంశు పూరంబులౌ
    ప్యరమం జిల్కగ బాలశైవలపుదీవ్చల్ గ్రాలు మన్బాన్చువన్
    వెర్తయందూగు మరాశబాలికవలెన్ నిర్మాయికావ్యంబుతో
    హరిణిలోచన నిద్రబోయెడిని"

అని

"మంజిముంజిల్కు కపోలపాశుల జికురములాక్రమించ స్ర్సీమహలోచన"

అని ప్రియురాలిని వర్ణిస్తాడు వర్ణించి

    "ఈ రాజమనోహరాస్యకరిరాజసమంచితయావప్రేమకున్
    భాజనమైదరాభరణ భవ్యసుఖంబులు నెట్ల వీడే స<
    యోజనముల బొనర్తు"

ఐని అంటాడు.

ఈచావుదశలో ఈతడి మన్నదవికారం మిక్కిలి రోతగదా అందులో "ఆలు గొర్రెలు గాస్తున్నారడం అవివేకం. రాజ్యమంతా పోయి అడవికి వస్తూ గొర్రెలునెత్తిన పెట్టుకొని రాజు వస్తాడనడం అంతకంటె అవివేకం ఇట్లాటి అప్రశస్తాలు దేశాన్ని పాత్రాన్ని దశను తెలిసికొన్నవివేకముతొ వ్రాసిన అంశాలుగావు.