పుట:Neti-Kalapu-Kavitvam.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


      
వేణునాదం చెవులబడగానే పరవశలై పరుగెత్తివచ్చి
ఆయన హృదయాన హృదయం జేర్చి సొక్కే
అయోధ్యాభామిను లెంత తపస్సుజేశారో"

అని వర్ణించేటప్పుడు కృష్ణవేణి మీదిశ్లేష, పుష్పలావికలకృతార్ధత గోపీధమ్మిల్లమనోజ్ఞత్వం, వేణుగానమహిమ, భామినుల పారవశ్యం, ఇవన్నీ యెక్కడికక్కడికి ఆహ్లాదకరంగానే వున్నా కొంచెమాలోచిస్తే యిదంతా అసంబద్ధ ప్రలాపమని తేలుతుంది. కృష్ణానది అయోధ్యలో వుండడమేమిటి? ఉన్నా

"న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి" (వా. రా)

(రాముడు పరదారలను కండ్లతోగూడా జూడడు.)

అని వాల్మీకీ అమృతుణ్ణి చేసిన రాముడికి పరకాంతాస్పర్శమనే వ్యంగార్థమేమిటి? అయోధ్యలో గోపికలేంది? ఉన్నా ఆగోపీధమ్మిల్లాలతో శ్రీరాముడి కేమి పని? రాముడు వేణుగానానికి ప్రసిద్దుడా? అయినా ఆయనమీద భామినులుపడి పరవశలు కావడం మెంత అసత్యం? అని ఆమాటల్లో వుండే అసంబద్ధతలు స్పుటపడతవి. రాముడికి పరకాంతాస్పర్శ అనుచితం. అయోధ్యలో కృష్ణానదివున్నదనడం అనుచితం. ఇట్లానే తక్కినవన్నీ అనుచితాలు. దేశానికి, కాలానికి పాత్రకు, ఉచితంగాని పై అసంబద్ధతలు కొంచెమైనా వివేకం వున్నవాండ్లకు రోతపుట్టించక మానవు. అందుకే అసంబద్ధతతొ నిండిన పైమాటలవంటి మాటలు రసవంతంగావున్నట్లు స్థిరపడడానికి స్థిరమైన బుద్ధిహీనత్వం వుండవలెను. కనుక అనౌచిత్యంవున్నా అది తెలియకుండా ఉండడానికి బుద్ధిహీనత్వం అవసరం. వివేకవంతులకు అనౌచిత్య రోతపుట్టిస్తుంది. దేశభేదం, కాలభేదం, పాత్రభేదం, అవస్థాభేదం వీటి నన్నిటిని వివేకంతోపాలించినప్పుడే కావ్యం ఔచిత్యవంతమవుతుంది. లేదా అనౌచిత్యం పాలై భ్రష్టం కాగలదు. ఈకాలపుకావ్యాల్లో యీ అనౌచిత్యం తరుచుగా కనబడుతునే వున్నది.