పుట:Neti-Kalapu-Kavitvam.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

195


వెలయించి ఉదాత్తకావ్యాపేక్షచేత వాటికి ఉచితమైన స్ధాన మిచ్చారు. తిర్యగ్జడప్రాకృతుల శృంగారాన్ని కావ్యంలో అప్రధానంగా స్వీకరించిన భారతీయుల భావానికి ఈతీరుగా నేను వ్యాఖ్యజేశాను. అదిగాక చిల్లర మనుషుల్లో పశువుల్లో శృంగారవీరాదుల మహాభావాలు పరిపోషం పొందలేవు అదిమాద్యాంతలన్నీ కొద్దిలోనే సరిపుచ్చుకుంటవి. యేవో నాలుగు మాటలు మాట్లాడి దీపమార్పడంతో అంతవవుతుంది కనుకనే యిట్లాటిరతి రసాభాసమన్నారు.

పూర్వపక్షం

అవునయ్యా:

"స్వకాంతారమణోపాయే కోగురుర్మృగపక్షిణాం"

(స్వకాంతలను ఆనందపరచడంలో మృగపక్షులకు గురువెవరు?) అని కామసూత్రవ్యాఖ్యలో జయమంగళుడి వృద్దవాక్య మన్నట్లు పరస్పరం అనురాగంగల కామినీ కాముకుడూ సమావేశం అయినప్పుడు ఆశృంగారలీలలు అద్భుతంగా వాటంతట అవే ఆవిర్భవిస్తవి. అందుకే ప్రహణనాలను చెప్పుతూ

"ప్రవృత్తే రతిసంయోగే రాగ ఏవాత్రకారణం
 స్వప్నేప్వపి న దృశ్యంతే భావాస్తే తే చ విభ్రమాః
 సురతవ్యవహారేషు యే స్యుః తత్క్షణకల్పితాః" (వా. కా)

సురతవ్యవహారంలో తత్ క్షణకల్పితమై వెలువడే ఆభావాలూ విభ్రమాలూ స్వప్నంలోగూడా కనబడవు. రతిసంయోగం ప్రవృత్త మయ్యేటప్పుడు ప్రేమే ఆభావాలకూ విభ్రమాలకూ కారణం అని వాత్స్యాయను డన్నాడు.

ఇట్లాటి శృంగారలీలలు స్వాభావికమైవుండగా అవి తిర్యక్కులకు మ్లేచ్ఛులకు లేవనడం అనుచితం. వారికి అనుభావాదులు లేవనడం