పుట:Neti-Kalapu-Kavitvam.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


195

శృంగారాధికరణం

వెలయించి ఉదాత్తకావ్యాపేక్షచేత వాటికి ఉచితమైన స్ధానమిచ్చారు. తిర్యగ్ధదప్రాకృతుల శృంగారాన్ని కావ్యంలో అప్రధానంగా స్వీకరించిన భారతెయుల భావానికి ఈతీరుగా నేను వ్యాఖ్యజేశాను. అదిగాక చిల్లర మనుషుల్లో పశువుల్లో శృంగారవీరాదుల మహాబావాలు పరిపోషంపొందలేవు అదిమాద్యాంతలన్నీ కొద్దిలోనే సరిపుచ్చుకుంటవి. యేదో నాలుగు మాటలు మాట్లాడి దీపమర్పడంతో అంతవవుతుంది కనుకనే యిట్లాటిరతి రసాబాసమనమన్నారు.

పూర్వపక్షం

అవునయ్యా:

"స్వకాంతారమణోపాయే కోగుదుర్మృగపక్షిణాం"

(స్వకాంతలను ఆనందపరచడంలో మృగపక్షులకు గురుచెవరు?) అని కామసూత్రవ్యాఖ్యలో జయమంగళుది వృద్దవ్య్తాక్య మన్నట్లు పరస్పరం అనురాగంగల కామినీ కాముకుడూ సమావేశం అయినపు ఆశృంగారలీలలు అద్బుతంగా వాటంతట అవే ఆవిర్బవిస్తవి.అందుకే ప్రహణనసలను చెప్పుతూ

      "ప్రవృత్తే రతిసంయోగే రాగ ఏవాత్రకారణం
      స్వప్నేస్వపి న దృశ్యంతే భావాప్తే తే చ విభ్రమా"
      సురతవ్యవహారేషు యే స్యు: తత్క్షణకల్పితా:" (వా కా)

సురతవ్యవహారంలో తత్ క్షణకల్పితమై వెలువడే ఆబావాలూ భ్రమాలూ స్వప్నంలోగూడా కనబడవు. రతిసంయోగం ప్రవృత్త మయ్యేటప్పుడు ప్రేమే ఆబావాలకూ విభ్రమాలకూ కారణం అని వాత్స్యాయను డన్నాడు.

ఇట్లాటి శృంగారలీలలు స్వాబావికమైవుండగా అవి తిర్యక్కులకు మ్లేచ్చులకు లేవనడంఅ అనుచితం వారికి అనుభావాదులు లేవనడం