పుట:Neti-Kalapu-Kavitvam.pdf/229

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
194
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


మగజింకకొమ్ములతోరాచింది; ఆడయేనుగు పంకజరేణుగంధి అయిన గుండూషజలాన్ని మగయేనుగ కిచ్చింది; చక్రవాకం సగం కొరికిన తామర తూడును ప్రియురాలికి ఆదరంతో యిచ్చింది.)

అని కాళిదాసు యీసాధుతిర్యక్ ప్రకృతిప్రేమను చిత్రించాడు. క్రౌంచద్వంద్వంయొక్క నిరతిశయానందం వాల్మీకికి సంతోషం కలిగించింది గనుకనే దానికి విఘాతంకల్పించిన బోయ ప్రేమద్రోహిగా కనబడ్డాడు.

"అంతస్సంజ్ఞా భవన్త్యేతే సుఖదుఃఖసమన్వితాః" (మను)

(వృక్షాలు అంతస్సంజ్ఞగలవి అయి సుఖదుఃఖసమన్వితాలుగా వున్నవి) అని మనువు ప్రబోధించినట్లు వనప్రకృతిసుఖాదులను కనుగోగలిగిన భారతీయులు అమాయికమైన తరుగుల్మాదులయందు సైతం ఆమనోహరప్రేమ మాధుర్యాన్ని ఆనందానుభూతితో చూడగలిగినారు.

"లతా వధూభ్యస్తరవోప్యవాపుః
 వినమ్రశాఖా భుజబంధనాని"
 
 చెట్లుగూడా లతావధువులవలన వినమ్రశాఖాభుజాశ్లేషాలు పొందినవి (కుమా)

అని మధుమాసంలో ఆ ప్రకృతి వికాసాన్ని కాళిదాసు ప్రసంసించాడు.

ఈతీరుగా ఆర్ధ్రనేర్ద్రాలతో తరులతాదులవాద్ద నుండి ప్రకృతి శిఖరమైన ధర్మనాయకుడివరకూ అనుస్యూతమైన జీవసౌందర్యా విచ్ఛిన్నతను దర్శించి కావ్యప్రస్థానాన్ని ఔచిత్య విలసితంజేసి ఇక అవకాశం లేదోమో ననిపించేటంత మహావికసిత దశను ప్రాపింపజేసిన భారతీయుల విజ్ఞానపరిపాకం అమేయమై వున్నది. కేవలం ముగ్ధప్రకృతిని చిత్రించే ఖండకావ్యాలను సయితం ఋతుసంహారంవంటి వాటిని