పుట:Neti-Kalapu-Kavitvam.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
196
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


అక్రమం

"తిర్యజ్మ్ల చ్ఛగతోపి వా"

అని సాహిత్య వేత్తలు వాండ్లరతిని ఆభాసమనడానికి వేరే కారణమున్నది. వాండ్లు వారిదృష్టిలోనీచులు. వాండ్లపైన వారికిద్వేషం. అందువల్ల రసాభాసమన్నారు. మ్లేచ్ఛులు ఆర్యులకు పరమశత్రువులుగదా

"న మ్లేచ్చభాషాం శిక్షేత" (శ్రు)

"న మ్లేచ్చితవై" (శ్రు)

అని మ్లేచ్ఛులను ద్వేషించిన ఆర్యులు వారిశృగారాన్ని యెట్లా సహించగలరు? అందువల్ల మ్లేచ్ఛుల రతి రసాభాసమన్నారు అంతేగాని వాస్తవంగా వారికి అనుభావాదులు వికసితం గాకపోవడం వల్లకాదు. అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; వాండ్లకూ శృంగారలీలలు వుండవచ్చును. శృంగారలీలలు మీరన్నట్లు వున్నవనే వొప్పుకుందాము. అంతమాత్రాన ఆశృంగారం ఉపాదేయంగా దని అది పరిణతనాయకనిష్ఠమైనప్పుడు ఆనందమేగాక ఉదాత్తభావోన్మీలనాదిరూపమైన ఆనుషంగికఫల ప్రాప్తి కలుగుతున్న దని వివరించాను అసలింతకూ పశువుల్లో నీచుల్లో అనుభావాదిసామగ్రి వికసితంగాదు. రసాభావనిరూపణం ఆర్యులు, మ్లేచ్ఛులమీదికోపంవల్ల చేసిందికాదు. పరిణతులు ధర్మరక్షకత్వ ధర్మపరతంత్రత్వాలతో వెలసే బ్రాహ్మణులు కావచ్చును. వైశ్యులు కావచ్చును. శూద్రులు కావచ్చును. ఆర్యేతరులు కావచ్చును. దుష్యంతుడు క్షత్రియుడు మేఘదూతలో యక్షుడు బ్రాహ్మణుడుగాడు ఆర్యుడుగాడు. కుమారసంభవంలో పరమేశ్వరుడికి కులమే లేదు