పుట:Neti-Kalapu-Kavitvam.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


ఇంతకంటే అధికంగా ఉదాత్తగుణోన్మీలనమూ సిద్ధిస్తుంది. అధమపాత్రల్లోవుండే సాధారణమైన స్వీకార్యగుణాలూ అంతకుపైగా ఉత్తములకు స్వతస్సిద్ధంగావుండే ఉత్తమగుణాలూ కలిసి ఉత్తముల యందే సిద్ధించేటప్పుడు ఉత్తములను వదలి అధములను స్వీకరించడం అనుచితకార్యం.

"నిన్నునమ్మివుంటాను నాయుడుబావా
 చింతచెట్టుపై నున్న నారాయణమ్మా
 చిగిరుకోస్తున్నావ నారాయణమ్మా
సన్నపన్నగాజులేవి నారాయణమ్మా
 నీచిన్ని చిన్ని చేతులాకు నారాయణమ్మా"

అనే యీపాట క్షుద్రశృంగారకోటినికూడా అతిక్రమించింది.

"ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే
 సామాన్యాస్తు పరార్థమద్యమభృతః స్వార్థా విరోధేనయే
 తేమీ మానుపరాక్షసాః పరహితం స్వార్థాయ విఘ్నంతి యే
 యేతుఘ్నంతినిరర్థకం పరహితం తే కే నజానీమహే". (భ.త్రి)

అని భర్తృహరి అధములను అతిక్రమించినవారికి పేరుకుదరక వదలినట్లు నేను శృంగారంయొక్క ఉత్తమత్వక్షుద్రత్వాలను నిరూపించి వీటినతిక్రమించిన యీనారాయణమ్మ నాయుడుబావల శృంగారం వంటి శృంగారానికి యిక్కడ పేరుపెట్టక వదులుతున్నాను. ముందు సందర్భంవచ్చినచోట దీన్ని దుష్టశృంగారమని వ్యవహరిస్తాను. కేతిగాడు బంగారక్కల శృంగారం వీండ్ల శృంగారానికి జత అయినది. అదిగాక నాయకులు ఉత్తములు పరిపాకవంతులు అయినప్పుడు వారిశృంగార సందర్భంలో

"వ్యతిషజతి పదార్థాన్ అంతరః కోపి హేతుః
 న ఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే"