పుట:Neti-Kalapu-Kavitvam.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


180

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

ఇంతకంటే అధికంగా ఉదాత్తగుణోన్మీలనమూ సిద్ధిస్తుంది. అధమపాత్రల్లొవుండే సాధారణమైన స్వీకార్యగుణాలూ అంతకుపైగా ఉత్తములకు స్వతస్సిద్ధంగావుండే ఉత్తమగుణాలూ కలిసి ఉత్తముల యందే సిద్ధించేటప్పుడు ఉత్తములను వదలి అధములను స్వీకరించడం అనుచితకార్యం.

"నిన్నునమ్మివుంటాను నాయుడుబావా
చింతచెట్టుపై నున్న నారాయణమ్మా
చిరిగుకోస్తున్నావ నారాయణమ్మా
సన్నపన్నగాజులేవి నారాయణమ్మా
నీచిన్ని చిన్ని చేతులాకు నారాయణమ్మా"

అనే యీపాట క్షుద్ర్సశృంగారకోటినికూడా అతిక్రమించింది.

"ఏతే సత్పురుషా: పరార్ధఘనా: స్వార్ధాన్ పరిత్యణ్య యే
సామాన్యాస్తుపదార్ధముద్యమభృత: స్వార్ధా విరోదేనయే
తేమీ మీనుపరాక్షసా: పరహితం స్వార్ధాయ విఘ్నంతి యే
యేతుఘ్నంతినిరర్ధకం పరహితం తే కే నజానీమహే"(భ.త్రి)

అని భర్తృహరి అధములను అతిక్రమించినవారికి పేరుకుదరక వదలినట్లు నేను శృంగారంయొక్క ఉత్తమత్యక్షుద్వత్వాలను నిరూపించి వీటినతిక్రమించిన యీనారాయణమ్మ నాయుడుబావల శృంగారం వంటి శృంగారానికి యిక్కడ పేరుపెట్టక వదులుతున్నను. ముందు సందర్బంవచ్చినచోట దీన్ని దుష్టశృంగారమని వ్యవహరిస్తాను. కేతిగాడు బంరారక్కల శృంగారం వీండ్ల శృంగారానికి జత అయినది. అదిగాక నాయకులు ఉత్తములు పరిపాకవంతులు అయినప్పుడు వారిశృంగార సందర్భంలో

    "వ్యతిషజతి పదార్ధాన్ అంతర: కోసి హేతు:
     న ఖలు బహిరుసాధీను ప్రీతయ: సంశ్రయంతే"