పుట:Neti-Kalapu-Kavitvam.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

181


(యేదో వొక అంతరకారణంవల్ల అనురాగం వుత్పన్న మవుతున్నది. అనురాగానికి బాహ్యోపాధులు సంశ్రయంగావు)

(మకరందుడు -మాలతీ.)

"సతాం హి సందేహపదేషు వస్తుషు

 ప్రమాణమంతః కరణప్రవృత్తయః"

(శా)


 

(సందేహపదమైన విషయాల్లో సాధువుల అంతఃకరణం ప్రమాణం)

"కమివహి మధురాణాం మండనం నాకృతీనాం
 రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శాబ్దాన్
 పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః
 తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

 భావస్థిరాణి జననాంతసౌహృదాని"

(శాకుం)

(నిజంగా మధురాకృతుల కేది మండనంగాదు? సుఖితంగా వుండిగూడా ప్రాణి రమ్యపదార్ధాలనుజూచి మధురశబ్దాలనువిని పర్యుత్సుకం కావడమనేది అనంశయంగా భావస్థిరాలైన జననాంతర సౌహృదాలను చిత్తంతో అజ్ఞాతంగా స్మరించడేమేను.)అని యిట్లాటి. ఉదాత్త భావాలు ఉన్మీలితంకాగవలవు. యెంకిపాటలు మొదలైనవాటివంటి ప్రాకృతుల శృంగారంలో

"మెళ్లో పూసలపేరు. తల్లో పూవులసేరు
 కళ్లెత్తితే సాలు కనకాబిసేకాలు"
"రాసోరింటికైన రింగుతెచ్చేపిల్ల

అని మోటుమనఃప్రవృత్తే వ్యక్తం కాగలదు. యింతకూ చెప్పదలచిందేమంటే ప్రణయగీతాలు ప్రణయసౌధాలు మొదలయినవి. యెంకిపాటలు మొదలయినవి.భారతిలోని "పరీక్ష" "సర్ఫదర్శిలోలక్కులు" మొదలయిన కథలు "చెన్నపట్టణములో" మొదలయిన నవలలు ప్రకటించేది