పుట:Neti-Kalapu-Kavitvam.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


179

శృంగారాధికరణం

చిత్తవిశ్రాంతినైర్మల్యాదులు అనుభూతుమై అట్లాటి కల్యాణగుణాలమీది అభిరతి అనుషంగికంగా సిద్ధించేదే అయువున్నది. ఇట్లాటివి మనతోబుట్టువులకు కూతుండ్లకుసిద్దిస్తే మంచిదనుకుంటాము. కాని మనకూతుండ్లు మనతోబుట్టువులు రాత్రులయందు యింట్లో వాండ్ల కన్నుగప్పి చేలకుపోయి మంచికిందా చెట్లల్లో రహస్య కార్యాలు చేయవలెనని కోరము యిటువంటి శృంగారం క్షుద్రమని ప్రధానంగా స్వీకార్యం కాదని అంటున్నాను.

పూర్ఫపక్షం

అవునయ్యా;
"గుడికి చండమెడతావుంటె నాయెంకి" (యెంకిపాట)
"తీర్ధాల కెందుకూ యాత్రలెందుకూ
దేవుడంతటమనకు లేడేచంద్రమ్మ"
                     (యెంకయ్య చందమ్మపాట)
"సొమ్ము లేలంటాది నాయెంకి" (యెంకిపాట)

అని యీపాటల్లోవున్నవి.యీతీరుగాదైవభక్తి వేదాంతం.సొమ్ములకోసం భర్తను వేధించకపోవడం స్పృహణీయగుణాలు గదా అనునంగికఫలాలు యెంకయ్య చంద్రమ్మపాటలో యెంకిపాటలొ గూడా ఆపేక్ష్యమైనవి వుంటున్నవి గనుకిఅ యివి స్వీకార్యమేనంటారా?

సమాధానం

చెపుతున్నాను; అదిసరిగాదు, సొమ్ములకోసం వేధించకుండా తమకు లభించిన వాటితోటే అందాలు దిద్దుకొనడం గుడికి దంణం బెట్టడం మొదలైనవి సాధారణ కర్యాలు. అదిగాక గుడికి దంణంబెట్టడం సొమ్ములకోసం వేధించకుండావుండడం మొదలయినవి ఉత్తమనాయికల్లోను సిద్ధిస్తవి