పుట:Neti-Kalapu-Kavitvam.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


నాసక్క నెంకీ, జాము రేతియేళ నీటుగా వొస్తుంటె
వొయ్యార మొలికిస్తుంది కులుకు సూపెడతాది
కులుకుతా నన్నేటో పలుకరించాలి
కనుబొమ్మ సూడాలి కమ్మగుండాలి" (యెంకిపాట)

"కడుపుకోసం మొక్కుకోవే చంద్రమ్మ"
                                        (వెంకయ్య చంద్రమ్మపాట)

"కొద్దిలో వరహాల కొడుకునేత్తేవంటి"

"(మంచెకింద)గోనెపట్టాయేసి గొంగడిపై నేసి
 కులాసగుంటాది" (యెంకిపాట)

"అంటింత చెట్లలో తంటాలుపడలేము
 పాతగొంగడి సింపి తేరో రెంకయ్య"
          (యెంకయ్య చంద్రమ్మపాట)

అని యిట్లాటి మనోవృత్తులు ప్రాకృతులు గనుకనే ప్రధానంగా బయటబడుతున్నవి. అనురక్త లోకత్వం తేజశ్శాలిత్వం సంస్కారప్రాప్తి యిట్లాటి స్పృహణీయగుణాలువున్న వ్యక్తియందు నిష్టమైతే ఆశృంగారవృత్తాంతం మనకు శ్రోతవ్యమై ఆనందమేగాక వీరత్వ తేజశ్శాలిత్వాలమీద అనురక్తి వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమై వుండే కల్యాణగుణాభిరతీ నాంతరీయకఫలాలుగా శృంగారంవల్ల సిద్ధిస్తున్నవని యిదివరకు విశదపరచాను. పొరుగుకాంతలతో వరసలాడడం పెండ్లాము యెదురు గావుంటే నాకు చాలుననడం నీవన్నెసిన్నియలు సూపేవా అనడం కులకడం సోకూ తిరణాలబోవడం మంచెకింద తిప్పలుపడడం (నా తిప్పతీశ్వరుడు లేడా అని) అంటింతచెట్లలో తంటాలుపడలే మనడం యివే యెంకిపాటలు మొదలైనవాటివంటి శృంగారంలో వ్యక్తమయ్యేవి. శాకుంతలంలో శకుంతలకు ఆశ్రమవాసమూలాన ప్రాప్తించిన సంస్కారం, అందువల్ల సిద్ధించిన ముగ్దప్రకృతిప్రేమ గురుజనరతి. యిట్లాటివాటి వల్ల కలిగే