పుట:Neti-Kalapu-Kavitvam.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యతిక్రమాధికరణం

129


16. ధర్మతనూభవు నందునాటిరే, యిమ్ములఁ జల్పి. ,,

17. మతినూహింపనశక్యమైసవనమున్ మర్ధింతు రెందున్.(తి.భా.)

18. అతులోర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్. (న:భా)

19. అమల సువర్ణశృంగఖురమై. ,,

20. అమలిన తారకాసముదయంబుల నేన్న ను. ,,

21. నిరుపమ ధర్మమార్గ పరినిష్ఠితు లై . ,,

22. మా. తంగస్ఫూర్జిత యూధదర్శనసముద్యత్ క్రోధమై.(తి.భా.)

23. కాన తగం బొందుట కార్య మియుభయమున్. ,,

యీతీరుగా భారతంలో ఆరబ్దమైన యీదండగమాటలు యెర్రాప్రెగడ హరివంశంలో అంతకంటె అధికంగా విస్తరించినవి ఆముక్తమాల్యద నిండా గుంపుగణం మూలుగుతున్నది. కొన్నిచోట్ల ఒక్కొకపద్యానికే మూడునాలుగు గుంపులున్నవి. ప్రథమాశ్వాసంలో ఒక్క శుకకదంబము అనేపద్యంలో రెండుగుంపులు "తలపక్షచ్చట" అనేపద్యంలో మూడుగుంపులు "నిర్ఘరప్ర" అనేపద్యంలో నాలుగు గుంపులు నిండినవి

1. లలితోద్యానపరంపరా.

2. పెరపురాళి.

3. తలపక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపఁగం జూచి యారెకులుషః స్నాతప్రయాత ద్విజావలి పిండీకృతశాటులన్ సవి తదావాసంబు చేరంగ రేవులడిగ్గన్ వెసబారువానిం గని నవ్వున్ శాలిగోప్యోఘముల్.