పుట:Neti-Kalapu-Kavitvam.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది             వ్యతిక్రమాధికరణం
                                          129
 16. ధర్మతనూభవు నందునాటిరే, యిమ్ములఁ జల్పి. ,,
 17. మతీనూహింపనశక్యమైనవనమున్ మర్ధింతు రెందున్.(తి.భా.)
 18. ఆతులో ర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్. (న:భా) 

 19. అమల సువర్ణశృంగఖురమై.    ,,
 20. అమలిన తారకాసముదయంబుల నేన్న ను.   ,,
 21. నిరుపమ ధర్మమార్గ పగినిష్ఠితు లై .  ,,
 22. మా. తంగస్ఫూర్జిత యూధదర్శనసముద్యత్ క్రోధమై.(త.భా.)
 23. కాన తగం బొందుట కార్య మియుభయమున్.  ,,
      యీతీరుగా  భారతంలో   ఆరబ్దమైన  దండగమాటలు
 యెర్రాప్రెగడ  హరివంశంలో  అంతకంటే  అధికంగా విస్తరించినవి
 ఆముక్తమాల్యద నిండా  గుంపుగణం  మూలుగుతున్నది. కొన్ని చోట్ల 
 ఒక్కొకపద్యానికే  మూడునాలుగు  గుంపులున్నవి.  ప్రథమాశ్వాసంలో 
 ఒక్క శుక కదంబము అనేపద్యంలో రెండుగుంపులు   "తలపక్షచ్చట" 
 అనేపద్యంలో మూడుగుంపులు "నిర్ఘరప్ర" అనేపద్యంలో నాలుగు గుంపులు 
 నిండినవి


  1. లలితోద్యానపరంపరా. 
 2. పెరపురాళి. 
  3. తలపక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర
   స్థలి  నిద్రింపఁగం జూచి యారేకులుషః స్నాతప్రయాత ద్విజా

   వలి  పిండీకృతశాబులన్  సవి  తదావాసంబు   చేరంగ రే 
   వులడిగన్  వెసబారువానిల  గని  నవ్వున్ శాలిగోప్యోఘముల్.