పుట:Neti-Kalapu-Kavitvam.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


గాకపోవడంవల్లను, తెలిసిందిలే అని శబ్దార్థవిచారణలేకుండా దాటవేసికొనిపొయ్యే ధోరణి బుద్ధిలో పాతుకొని పఙ్త్కిమననమంటేఅదెట్లావుంటుందని అడిగేదశకు ఆంధ్రులం వచ్చాము.

1. జననాధ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్.

2. గొనకొని వీడునీకును శకుంతలకుం బ్రియనందనుండు.

3. పెట్టు నీవారాన్న పిండతతులు. (న.భా)

4. వర్జితకుసుమాక్షతావళులు (న.భా. దుష్యంతచరిత్రం)

5. సహకారములం గదళీతతులన్. ,,

6. తనరజనకుండు నన్న ప్రదాత. ,,

7. దుర్మతి కిహముం బరముఁ గలదె మదిఁబరికింపన్. ,,

8. ఇమ్ముగ సరస్వతీతీరమ్మున. ,,

9. దక్షిణ లిమ్ముగనిచ్చి. ,,

10. తగఁగవివాహంబెన్నం, డగునొకొయెన్నండు సంగమావాప్తి యుమా, కగునొకొ యనియెదం గోరుచు, నొగి నిటనుండిరి సుభద్రయును విజయుండున్. (న.భా)

11. మతిననురక్తయయివానిమానుగఁదనకుం, బతింజేసికొనియె..

12. తనునెరిగిన యర్థంబొరు, డనఘా యిది యెట్లు చెప్పుమన...

13. ఇమ్మహిం ద్రయోదశద్వీపమ్ములు దన శౌర్యశక్తి..

14.ఆలునుదాసియున్ సుతుడునన్నవి బాయనిధర్మముల్ మహిన్.."

15. మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల. ,,