పుట:Neti-Kalapu-Kavitvam.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


127

వ్యతిక్రమాదికరణం

పొడుగైనఒక్క పాదంతొ వున్నవి ఇట్లా పాదభంగంచేత సాదసౌందర్యం లుప్త్గమయి వికృతమైంది.

వళిప్రాసల అనర్ధాలు

   వళిప్రాసలు శబ్దాలంకారాలకు చేరిన అస్థిరధర్మాలు ఇవి పద్యానికి అవశ్యంగావు వీటిని నన్నయాధికరణంలో వివరించాను. వీటిని అవశ్యకనీయంగా స్వీకరించినప్పుడివి పద్యానికి పనికిమాలినవే గాకుండా అనర్ధహెతువులుగూడా అవుతున్నవి. యతిభంగంపాదభంగం అనేకస్థలాల్లో యీవళిప్రాసలవల్లనే సంఃభవించి దండగ్గణం భూమిగణం, గుంపుగణం, ప్రకాశగణం, సంబోధనగణం, అదికవిశేషణగణం అపతితమై పద్యం భ్రష్టమైంది. యతిభంగ పారభంగా లిదివరకే వివరించారు.
   గొనకొని వన్నుగ, మానుగ, ఓలి, ఓగి, మదినంచ, మతినూహించ మొదలైనచ్వి దండగ్గణం ఆవలి, సమూహం, నికరం, పిండు, తతి, వ్రాతం మొదలైనవి గుంపుగనం యెసగు, యెసకమొసగు, చెన్నలరారు, చెన్నుమీరు, విలసిల్లు, రాజిల్లి, విలసత్, రాజత్, బ్రాజత్, లసత్, ఉజ్వలత్ మొదలైనవి ప్రకాశగణం అనఘా ఇద్దతేజ మొదలైనవి సంబోధనగణం ఉద్యత్, ప్రోద్యత్, అతుల, అమలిన, అనుపమ, సార, స్ఫార, అమల మొదలైనచి అదికవిశేషణగణం వక్ద్యమాణమైన శబ్దవాచ్యత్గాదోషం సయితం యీ అధికవిశేణంలో చేరుతున్నది. ఈ గనాలు కొన్నిచోట్ల చందోవ్యతిక్రమంవల్ల కొన్నిచోట్ల నళిప్రాసల నిర్బద్దమె పాదం పూర్తిగాక, నళిప్రాసలు పైనబడవలసివుండి  అటునాలుగు యిటునాలుగు అధికవిశేషణాస్లు వేసి వ్యంగ్యసౌందర్యం రూపుమాసి పైగా దండగ్గణం గుంపుగణం మొదలైన వాటినిదింపి పద్యాన్ని పెంటబుట్టనుచేశాము. ఇట్లా పద్యాలు వ్యంగ్యశూన్యమై పిచ్చిదండగ మాటలతొ నిండడంవల్లను, వీటిని సవిచారణాగా చదవడం అవసరం