పుట:Neti-Kalapu-Kavitvam.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దవాచ్యతాధికరణం

107


ప్రణయాన దోగుచు ప్రణయగీతముల
ప్రణయంబు పల్లవింపగ బాడుకొనుచు
ప్రణయ రూపానంద భాగ్యంబుగాంచి
ప్రణయ శాసనమున ప్రణయరాజ్యంబు
పాలింత మిక రమ్ము ప్రణయాధినాథ" (యేకాంతసేవ)

అని ప్రణయంప్రణయం ప్రణయమని పులుముతున్నారు
     
"ఏకోపి, జేయతే హంత కాళిదాసో న కేన చిత్
 శృంగారే లలితోద్గారే కాళిదాసత్రయీ కిము"

అని ప్రసిద్ధిజెందిన కాళిదాసు తనకావ్యాన్ని శృంగారకుమారసంభవమని గాని శృంగార మేఘదూతమనిగాని శృంగారశాకుంతలమనిగాని చెప్పలేదు. కాని యిప్పటి కృతికర్తలు కొన్ని పద్యాలువ్రాసి కక్కురితిపడి ప్రణయగీతమని ప్రణయసౌధమని ప్రణయజానకి అని శబ్దవాచ్యతపాలు చేస్తున్నారు. శృంగారశ్రీనాథమని శృంగారకాదంబరి అని అచ్చువేయడం ఔచిత్యరాహిత్యాన్నే విశదంజేస్తున్నవి. శృంగారనైషధమని వుండడమే చింత్యమైవుండగా శృంగారం ప్రధానంగా లేకున్నా శ్రీనాథచరిత్రను శృంగారశ్రీనాథమనడం బాణుడు కాదంబరి అన్న దాన్ని శృంగారకాదంబరి అనడం యీదోషంలోనే చేరుతున్నవి. ఇవన్నీ శబ్దవాచ్యతను ఆపాదించి వెగటూ రోత పుట్టిస్తున్నవి. భవభూతి "కరుణో రసంః"అని "అద్భుతరస:" అని యీతీరున రసాలను శబ్దవాచ్యత పాలుచేసినందుకు సయితం సమకాలపు అనాదరన కొంత యేర్పడివుంటుంది.

కావ్యజిజ్ఞాసలు వెలయించిన కాలంలో రసాదులకు శభ్దవాచ్యత దోషమని భవభూత్యాదులదోషాలవంటివే దోవజూపివుంటవి "రసగంగాధరం, రసార్ణవసుధాకరం" అని యిట్లా సాహిత్యగ్రంథాల్లోను, తక్కినస్థలాల్లో విచారసమయాల్లోను, కావ్యాల్లోను స్థాయి సంచారిభావాలను ప్రదర్శించేటప్పుడు కవులు శృంగారమని వీరమని అద్భుతమని కరుణమని, రోమాంచమని, నిర్వేదమని యెక్కడనో