పుట:Neti-Kalapu-Kavitvam.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


107

శబ్దవాచ్లతాధికరణం

ప్రణయాన దొగుచు ప్రణయగీతముల
ప్రనయంబు పల్లవింపగ బాడుకొనుచు
ప్రణయ రూపానంద భాగ్యంబుగాంచి
ప్రణయ శాసనమున ప్రనయరాజ్యంబు
పాలింత మిక రమ్ము ప్రణయాదినాధ" (యేకాంతసేవ)

అని ప్రణయంప్రణయం ప్రణయమని పులుముతున్నారు
     'ఏకోపి, జీయతే హంత కాలిదాసో న కేన చిత్
     శృంగారే లలితోద్గారే కాళిదాసత్రంయీ కిము"

అని ప్రసిద్దిజెంచిన కాళిదాసు తనకావ్యాన్ని శృంగారకుమారసంభవమని గాని శృంగార మేఘదూతమని గాని శృంగారశాకుంతలమనిగాని చెప్పలేదు. కాని యిప్పటి కృతికర్తలు కొన్ని పద్యాలువ్రాసి కక్కురితిపడ్శి ప్రేణయగీత్రాని ప్రనయసౌధమని ప్రణయ్హజానకి అని శబ్దవాచ్యతసాలు ఛేస్తున్నారు. శృంగారశ్రీనాధమని శృంగారకాదంబరి అని అచ్చువేయడం ఔచిత్యరాహిత్ర్యాన్నే విశదంజేస్తున్నవి. శృంగారనైషధమని వుండడమే చింత్యమైవుండఘా శృంగారం ప్రధానంగా లేకున్నా శ్రీనాధచరిత్రను శృంగారశ్రీనాధమనడం బాణుడు కాదంబరి అన్న దాన్ని శృంగారకాదంబరి అనడం యీదోషంతోనే చేరుతున్నవి. ఇవన్నీ శబ్దవాచ్యత్సను ఆపాదించి వెగటూ రోత పుట్టిస్తున్నవి. భవభూతి "కరుణో రసం:"అని "అద్బుతరస:" అని యీతీరున రసాలని శబ్దవాచ్యత పాలుచేసినందుకు సయితం సమకాలపు అనాదరన కొంత యేర్పడివుంటుంది.

      కావ్యజిజ్ఞాసలు వెలయించిన కాలంలో రసాదులకు శభ్దవాచ్యత దోషమని భవభూత్యాదులదోషాలవంటివే దోవజూపివుంటవి "రసగంగాధరం, రసార్ణవసుధాకరం" అని యిట్లా సాహిత్యగ్రంధాల్లోను, తక్కినస్థలాల్లో విచారసమయాల్లోను, కావ్యాల్లోను స్థాయి సంచరిభావాలను ప్రదర్శించేటప్పుడు కవులు శృంగారేమని వీరమని అద్బుతమని కరుణమని, రోమాంచమని, నిర్వేదమని యెక్కడనో