పుట:Neti-Kalapu-Kavitvam.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పులుముడుఘటనాధికరణం

83

(కవులసామర్థ్యం గణించేటప్పుడు మొట్టమొదట కాళిదాసు పేరుచెప్పి కనిష్ఠికను గణించారు. కాళిదాసు తరవాత అతనికి ద్వితీయుడుగా వుండదగ్గకవి కనబడలేదు. ఇప్పటివరకూ కనబడలేదు. గనుకనే కనిష్ఠికతరువాతి వేలు పేరులేకుండా అనామిక అని అర్థవతిఅయింది.) అని స్తుతిస్తున్నారు.

"నిర్గతాసు నవా కస్య కాళిదాసస్య సూక్తిషు,
 ప్రీతిర్మధురసార్దాసు మంజరీష్వివ జాయతే" (హర్ష)

మధురసార్ద్రలైన పూలగుత్తులయందువలె నిర్గతమైన కాళిదాససూక్తులయందు యెవరికి ప్రీతి జనించదు?)

అని బాణుడూ,

"కవికులగురుః కాళిదాసః" (ప్రస)
 (కవికులగురువైన కాళిదాసు)}}

అని జయదేవుడూ,

"దాసతాం కాళిదాసస్య కవయః కే న బిభ్రతి." (మధు )

(యేకవులు కాళిదాసుకు దాసులుకారు?) అని గంగాదేవీ ఆ ఉత్తమకవితాస్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. అకవిత్వస్వరూపం గోచరించడానికి సయితం అంతటి సంస్కారం బుద్ధికి కావలసివున్నవి. కాని, కాళిదాసాదుల ఆ ఉత్తమ కావ్యాలను అపరిణతులైన బాలవిద్యార్థుల పాలుచేసి వారికి మొదటనే రఘువంశం ఆరంభంచేసి, తరతరాలుగా మనమీకవితా దేవిని నిరసించాము. విద్యార్థి లోకాన్ని వంచించి మనంవంచితులమైనాము.

"తస్మై నమః కర్మణే." (త్రిశం.)

అని భర్తృహరి అన్నట్లు కర్మఫలం మనకు అనుభూతమయింది. ఆ నిరాసానికి ఘోరశిక్షగా కవితాస్వాదనశక్తే జాతికి నశించింది. ఇది వేరేవిషయం. స్థలాంతరంలో దీన్ని పూర్తిగా మిమాంసచేశాను గనుక విస్తరభీతిచేత దీన్ని వదలుతున్నాను. లభ్యాలభ్యమై దృశ్యాదృశ్యదశలో