పుట:Neti-Kalapu-Kavitvam.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


లీలామాత్రంగా గోచరిస్తూ పిపాసువుల చిత్తవృత్తికి ప్రత్యక్షవాక్కులచేత గృహీతమైనప్పుడు మేయమై, మితమై, సౌందర్యతృష్ణను కుంఠితం చేస్తున్నది. కనుకనే "పరిమితస్వరూపాః" అని యిట్లాటి కావ్యబంధాలను గురించి ఆనందవర్థనుడన్నాడు. ఇట్లాభావాన్ని మితంజేసి భావ విభుత్వాన్నితగ్గించేది ఉత్తమత్వంనుండి తప్పక పతితమవుతున్నది. కనుకనే యిట్లాటిదాన్ని మధ్యరకంలో చేర్చారు.

"వ్యంగ్యస్య అప్రాధాన్యే మధ్యమం గుణీభూతవ్యంగ్యమితి గీయతే" (ప్రతాప.) |

(వ్యంగ్యార్థం అప్రధానమైనప్పుడు ఆకావ్యం గుణీభూత వ్యంగమవుతున్నది. అది మధ్యమకావ్యం) అని విద్యానాథు డంటున్నాడు.

భవభూతి

"రే హస్త దక్షిణ మృతస్య శిశోర్ద్విజస్య
 జీవాతవే విసృజ శూద్రమునే కృపాణం.
 రామస్య గాత్రమసి నిర్భరగర్భఖిన్న
 సీతావివాసనపటోః కరుణా కుతస్తే." (ఉత్తర.)}}

అని చెప్పినది గుణీభూతవ్యంగ్యమే అయివున్నది.

రాముడిగాత్రమగు నీకు కరుణయెక్కడిది అంటే, రాముడు నిష్ఠురత్వం, సీతావివాసనపటుత్వం, ధర్మం కొరకు అవలంబించే కాఠిన్యం ఈతీరున శ్రోతృపరిణతి ననుసరించి ఒక భావపరంపర గోచరిస్తుంది. కాని "నిర్బగర్భఖిన్న సీతావివాసనపటోః" అని ఆభావాన్ని సాక్షాత్తుగా విప్పిచెప్పి మితంమేయంజేశాడు.

అయితే ఆమాటలయినా మితంగా సహృదయులకు ఆస్వాద్యంగా చెప్పబట్టి మనోజ్ఞత్వాన్ని సంపూర్ణంగా కోల్పోలేదు గనుక యివికూడా రెండవరకంగా, ఆనందజనకమయ్యే వున్నవి. అందుకే

"రమణీయాస్సనో వివేకినాం సుఖావహాః" (ధ్వన్యా.)}}