పుట:Neti-Kalapu-Kavitvam.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


________________

82

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

అని ఆనందవర్ధను ఉంటున్నాడు.

ఇట్లానే తక్కిన సాహిత్యవేత్త లందరు చెప్పుతున్నారు; కాళిదాసాదుల కావ్యాలీ ఉత్త మత్వాన్నే పొందివున్నవి. ఆకాలంనాటికి వికసితమైన సర్వవిజ్ఞానం బలప్రదమై వుండగా సర్వభావాలకు మొదట వశుడై పిమ్మట సర్వ భావాలను వశంచేసుకొని సత్వతేజస్సుతో వెలసే దశయం ఈ ఉత్తమకవితాసిద్ధి కలుగుతున్నది, ఇట్లాటి కవితాదశ సర్వ లోనే కాళిదాసాదుల కేకొద్దిమందికో తప్ప మిక్కిలి అరుదుగా గోచరిస్తున్నది. కనుకనే--

"నరత్వం దుర్లభం లోకే విద్యా తత్ర సుదుర్లభా,

కవిత్వం దుర్లభం తత్ర శక్తి స్తత్ర సుదుర్లభా." (అగ్నే.)

అని ఆగ్నేయపూణకారు డన్నాడు.

"యేనాస్మిన్నతివిచిత్ర కవిపరంపరావాహిని సంసారే కాళిదాస ప్రభృతయోద్విత్రాః పంచషాపోమహాకవయ ఇతి గణ్యస్తే"

(ధ్వన్యా)

(ఈ అతివిచిత్ర కవిపరంపరా చక్రంలో కాళీదాస ప్రభృతులు ఇద్దరు ముగ్గురు లేదా అయిదారుగురు మాత్రమే మహా కవులనీ పరిగణితులవుతున్నా రు.) అని అన్న ఆనందవర్ధనుడు ఈ అభిప్రాయాన్నే తెలుపుతున్నాడు.

"కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమి,

పర్వతే పరమాశా చ పదార్థత్వం వ్యవస్థితం."

(కాళిదాసాదులూ కవులు, మేమూ కవులమే పర్వతమూ పదార్థమే, పరమాణువూ పదార్థమే.)

అనీ కవితాతత్వజులంటున్నారు.

"పురా" డ సీనాగు గణనో ప్రసంగే కనిష్టికాధిష్ఠితకాళిదాసా.

అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ."