పుట:Neti-Kalapu-Kavitvam.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


________________

పులుముడు ఘటనాధికరణం

83

(కవులసామర్థ్యం గణించేటప్పుడు మొట్టమొదట కాళిదాసు పేరుచెప్పి కనిష్ఠికను గణించారు. కాళిదాసు తరవాత అతనికి ద్వితీయుడుగా వుండదగ్గకవి కనబడలేదు. ఇప్పటివరకూ కనబడలేదు. గనుకనే కనిష్ఠికతరువాతి వేలు పేరులేకుండా అనామిక అని అర్థవతి అయింది.) అని స్తుతిస్తున్నారు.

"నిర్గలాసు నవా కస్య కాళీదాసస్య సూక్తిమ,

ప్రీతిర్మధురసార్దాసు మంజరీష్వేవ జాయతే" (హర్ష)

మధు రసార్రలైన పూలగుత్తులయందువలె నిర్గతమైన కాళిదాససూక్తులయందు యెవరికి ప్రీతి జనించదు?)

అని బాణుడూ,

"కవికులగురుః కాళిదాసః"

(ప్రస)

(కవికులగురువైన కాళిదాసు)

అని జయదేవుడూ,

"దాసతాం కాళిదాసస్య కవయః కే న బిభ్రతి." (మధు )

(యేకవులు కాళిదాసుకు దాసులు కారు?) అని గంగాదేవీ ఆ ఉత్తమ కవితాస్వరూపాన్ని ఆరాధిస్తు న్నారు. అకవిత్వస్వరూపం గోచరించడానికి సయితం అంతటి సంస్కారం బుద్ధికి కావలసివున్నవి. కాని, కాళిదాసాదుల ఆ ఉత్తమ కావ్యాలను అపరిణతులైన బాలవిద్యార్థుల పాలుచేసి వారికి మొదటనే రఘువంశం ఆరంభంచేసి, తరతరాలుగా మనమికవితా దేవిని నిరసించాము. విద్యార్థి లోకాన్ని వంచించి మనంవంచితులమైనాము.

"తగై నమః కర్మణే." (త్రిశం.)

అని భర్తృహరి అన్నట్లు కర్మఫలం మనకు అనుభూతమయింది. ఆ నిరాసానికి ఘోరళీక్షగా కవితాస్వాదనశక్తీ జాతీకి నశించింది. ఇది వేరేవిషయం. స్థలాంతరంలో దీన్ని పూర్తిగా మిమాంసచేశాను గనుక విస్తరభీతీచేత దీన్ని వదలుతున్నాను. లభ్యాలభ్యమై దృశ్యాదృశ్యదశలో