పుట:Neti-Kalapu-Kavitvam.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోమయత్వాధికరణం

75


యీ అయోమయపుమాటలను గురించి చర్చించడం అనవసరం. బుద్ధి అపరిణతమై వున్నప్పుడూ, చెప్పదలచినది చెప్పడానికి బలంలేని భీరుత్వం తమస్సు ఆవరించివున్నప్పుడూ, చెప్పవలసినదేమీ లేనప్పుడూ, ఉన్నది మామూలు అభిప్రాయమై దాన్ని యేమేమో మెలికలువేసి ఆత్మవంచనకు ఆరంభించినప్పుడూ, యీఅయోమయం దిగుతుందని చెప్పి చాలిస్తున్నాను. యెంతో జ్ఞానాన్ని దేశం నిండా వెదజల్లిన వేమన ప్రభృతులు సయితం

"నీరు కారమాయె కారంబు నీరాయె
 కారమైన నీరు కారమాయె
 కారమందు నీరు కడురమ్యమైయుండు
 విశ్వదాభిరామ వినురవేమ. (వేమ)
 
 బ్రహ్మ గుఱ్ఱమాయె భవుడు పల్లంబాయె
 నాది విష్ణు లెన్న నంకె నాయె
 నందు మీదివాడు ఆడదో మొగవాడొ
 విశ్వదాభిరామ వినురవేమ" (వేమ)

"మొనలుమీదుగ తలలుకిందుగ మొలచియున్నది వృక్షమూ
 మోదమలరగ మంట మీదను మదగజము విహరించెరా
 చిదిమి పట్టిన బంటుకైవడి చీమయేనుగు మింగెరా
 విర్రవీగుచు కేక వేయుచు యోగమంచము మింగెరా
 గొర్రెయొక్కటి అయిదుపులులను గొట్టి నెత్తురుదావెరా
 చిర్రిచెట్టున జాజిపూవులు శ్రీకరంబుగ పూచెరా
 మర్రిపై కదళీఫలంబులు మళ్లూరిరామదయానిధే.
 కొంచమౌ నొకగృహములోపల కోటిసింహము లుండెరా
 అంచితంబుగ నన్నిటిని యొకసామజంబు వధించెరా
 పంచవన్నెల చిలుకలైదొక పర్వతము భక్షించెరా
 మంచి తత్వజ్ఞానమిది మళ్లూరిరామదయానిధే.
 ఒంటిపాటుల రెండుకోతులు జంటపిల్లుల నీనెరా
 కంటి నని ఒక నక్కకడుపున కామధేనువు పుట్టెరా