పుట:Neti-Kalapu-Kavitvam.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


________________

అయోమయ త్వాధీకరణం

యీ అయోమయపుమాటలను గురించి చర్చించడం అనవసర ధ అపరిణతమై వున్నప్పుడూ, చెప్పదలచినది చెప్పడానికి బలంలేని భీరుత్వం తమస్సు ఆవరించివున్నప్పుడూ, చెప్పవలసినదేమి లేనప్పుడు, ఉన్నది మామూలు అభిప్రాయమై దాన్ని యేమేమో మెలికలువేసి ఆత్మవంచనకు ఆరంభించినప్పుడూ, యీ ఆయోమయం దిగుతుందని చెప్పీ చాలిస్తున్నాను. యెతో జ్ఞానాన్ని దేశం నిండా వెదజల్లిన వేమన ప్రభృతులు సయితం

"నీరు కారమాయె కారంబు నీరాయె

కొరమైన నీరు కారమాయె

కారమందు నీరు కడురమ్యమైయుండు

విశ్వదాభిరామ వినురవేమ.(వేమ)

బ్రహ్మ గుడ్డమాయె భవుడు పల్లంబాయె

నాది విష్ణు లెన్న వంకే నాయె

నందు మీదివాడు ఆడదో మొగవాడొ

విశ్వదాభిరామ వినురవేమ"(వేమ)

"మొనలుమీదుగ తలలుకిందుగ మొలచియున్న ది వృక్షమూ మోదమలరగ మంట మీదను మదగజము విహరించేరా చిదిమి పట్టిన బంటుకైవడీ చీమయేనుగు మింగెరా వీర్రవీగుచు కేక వేయుచు యోగమంచము మీంగేరా గొర్రెయొ క్కటి అయిదుపులులను గొట్టి నెత్తురుదావెరా చిర్రిచెట్టున జాజిపూవులు శ్రీకరంబుగ పూచెరా మర్రిపై కదళీఫలంబులు మళూరీరామదయానిధే. కొంచమౌ నొకగృహములోపల కోటిసింహము లుండేరా అంచితంబుగ నన్ని టీని యొకసామజంబు వధించేలా పంచవన్నెల చిలుకలైదొక పర్వతము భక్షించెరా మంచి తత్వజ్ఞానమిది మళూరీరామదయానిధే. ఒంటిపాటుల రెండు కోతులు జంటపిల్లుల నీనేరా కంటీ నని ఒక నక్కకడుపున కామధేనువు పుట్టగా