పుట:Neti-Kalapu-Kavitvam.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


మోహనవినీలజలధరమూర్తి నేను
ప్రళయజంఝూప్రభంజనస్వామి నేను

ఎవ్వరని యెంతురో నన్ను ఏననంత
శోకభీకరతిమిర లోకైకపతిని
కంటక కిరీటధారినై కాళరాత్రి
మధ్యవేళల జీమూతమందిరంపు
గొలువుకూటాల నే కాంతగోష్ఠిదీర్చి
దారుణ దివాంధరోదన ధ్వనులశ్రుతుల
బొంగి పొంగియు నుప్పొంగి పొరలిపోవు
నావిలాపనిబిడగీతికావళీవి
రావముల నర్ధరాత్ర గర్భమ్ము మరియు
మరియు భీషణకాళిమోన్మత్తగాగ
జేయు తఱి నన్ను మీరు వీక్షింపలేదొ "

ఇది కూడా ఆకృష్ణపక్షంలోవున్న అయోమయధోరణే. వాస్తవంగా శోకభీకర తిమిరలోకైకపతు లెవరైనావుంటే ఇట్లా చెప్పుకోవడం అంతగా వుచితంకాదు. ఇట్లాటిమాటలను గురించే కాబోలు. "కంచుమోగునట్లు కనకంబుమోగునా" అని వేమన అన్నాడు. చిన్నప్పుడు వెంట్రుకలు మొగానికి కప్పుకోని "ఆం! నేను యెలుగొడ్డును" అని దడిపిస్తే మొగం తేరి పారజూచి "నీవు అన్నయ్యవుగావా" అన్నమాటలు జ్ఞాపకానికి వస్తున్నవి.

"ఏవియో ఘోర పవనార్బటీధ్వను లివె
 కర్మకుహరాంతరస్థలిం గలత బరచు
 ధూమపావకజ్వాలల నొదిగియుండి
 భూత పైశాచములు నన్నుఁ బొడుచుచుండు."

అని భూతాలూ పైశాచాలూ విడివడి బాధిస్తున్న యామర్తి సూర్యప్రకాశరావువారిమాటలు ఈప్రళయజంఝూప్రభంజనస్వామి అయోమయపు కోటిలోని వేనని చూపి ఈచర్చ ముగిస్తున్నాను. ఇఘ