పుట:Neti-Kalapu-Kavitvam.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


పిమ్మట రామానుజాదు లీజిజ్ఞాసల సాగించారు. మాధవాచార్యులవంటి మేధా సముద్రుల ఈజిజ్ఞాసలకు ఆకృష్టులైనారు. కవులనుండి యీతత్వ జిజ్ఞాసలు పూర్తిగా విడిపడ్డవి. కవులీ జిజ్ఞాసలకుచేర్చదగ్గది మృగ్యమైతోచినది.

శాఖోపశాఖలతో పెరిగిన యీవిజ్ఞానం అధిగమించడంలో యెన్నో సంవత్సరాలు పట్టుతున్నవి. బుద్ధి విశ్రాంతావస్థకు వస్తున్నది. తత్వజిజ్ఞాసలకు దారిచూపే అనుభవాలు ఉండజాలనంతగా శాస్త్రవేత్తలు గార్లించి అనంతంగా వృద్ధిపరచారు. ఇక కవులేదైనా చెప్పితే అది ఆఅమేయశాస్త్రశాఖలముందు నిస్తేజంగా అణగి పోవలసినదే ఆయెను. కనుకనే శ్రీహర్షుడు తన అనిర్వచనీయత్వసిద్ధాంతాన్ని ఖండన ఖండఖాద్యమనే ఒక గ్రంథంలో ప్రతిపాదించి, దాన్ని శాస్త్రశాఖలకు చేర్చాడుగాని తనకావ్యంల్లో వాక్యరూపంగా చెప్పి వూరుకుండలేకపోయినాడు. అట్లా వూరుకుంటే విస్తరించివున్న శాస్త్రశాఖలయెదుట ఆవాక్యాలు నిల్వజాలవు. కనుకనే శంకర రామానుజాదుల తరువాత ఈజిజ్ఞాసలను స్పృశించ అవకాశం కవులకు కనబడలేదు. ఇక ఆంధ్రదేశంలో శంకర రామానుజాదుల ప్రచారమేగాకుండా దేశీయుల్లో అనేకు లీవిజ్ఞానాన్ని వెదచల్లినారు. గురువని మీమాంసకుల్లో ప్రసిద్ధిగన్న ప్రభాకరుడివలె ఆంధ్ర దేశంలో గురుపద వాచ్యుడైన వీరబ్రహ్మ. . వేమన్న, సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన యోగులు, తత్వజ్ఞులు. దేశభాషాసాధనంతో ఆంధ్రదేశపు పల్లెపల్లెల ఈజిజ్ఞాసలను ప్రతిధ్వనింప జేశారు. వ్యాసుడు, జైమిని, గౌతముడు, కణాదుడు. కపిలుడు, పతంజలి. శంకరుడు. రామానుజుడు మొదలైన మహాతత్వవేత్తలు, బ్రహ్మగురువు, వేమన్న సిద్దప్ప, శివరామదీక్షితులు మొదలైన జ్ఞాననిధులు దేశాన్ని ప్రబోధిస్తుండగా వీటినిమించి కొత్తవెలుగుచూపే విజ్ఞానం కవులు ప్రసాదిస్తే తప్పక వారిని ఆరాధిస్తాము. కాదా? వారితత్వకవిత్వపుమాటలు నిస్సారములే కాగలవు. ఇంకా ఆధ్యాత్మికవిజ్ఞానం అస్ఫుటాపస్థలో వున్న అభారతీయులకు అట్లాటి తత్వకవిత్వం గొప్ప అయితే కావచ్చునుగాని ఆధ్యాత్మికవిజ్ఞానం పరిపాకావస్థకు వచ్చినభారతవర్షంలో అందులో