పుట:Neti-Kalapu-Kavitvam.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్త్వజిజ్ఞాసాధికరణం

69


ఆంధ్రదేశంలో అది తప్పక నిస్సారమే అవుతుంది. ఆతత్వకవిత్వం ఆంధ్రులకు అవసరంమాలిందేకాగలదు. ఇట్లా పరిహాసాస్పదమైన నీరసపు తత్వకవిత్వం ఈ కాలపు కృతుల్లో తరుచుగా కనబడుతున్నది.

"జననమరణములు రెండు విశ్రాంతిలేక
 జరుగుచుండును నీప్రపంచంబునందు." (వనకుమారి)
                (పునరపి మరణం పునరపి జననం. భజగో)

"ఒకప్పుడు కొన్ని సంఘము లుత్తమస్థితి గలిగియుండు
 మరికొన్ని అధమ సన్మానంబునొందు
 కష్టసుఖముల నీచోచ్చగతులు గలవు
 చక్రదండంబునకు బోల" (వనకుమారి)

"కస్యాత్యంతం సుఖముపనతం దుఃఖమేకాంతతోవా
 నీచై ర్గచ్చ త్యుపరిచ దశా చక్రనేమిక్రమేణ" (మేఘ)

"కాలమహత్వమెవ్వరికి గన్గొనరాదు ప్రతిక్షణంబు గా
 ర్యాళి ప్రయత్న లబ్దమగు కల్గవు కొన్ని ప్రయత్నయుక్తినేన్
 లీల లయించు భాగ్య. మవలీల దరిద్రతబోవు యిట్టులే
 తేలును మున్గుకాలజలధిన్ సకలంబును అస్వసంత్రతన్."
                                                                 (వనకుమారి).

"కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః
 కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః.
 కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖే."
                                                    (మహాభా. ఆ.)

"కాల ఏవహి పురుషాన్ అర్థానర్థయోః
 జయపరాజయయోః . సుఖదుఃఖయో శ్చ స్థాపయతి." (వా.కా.సూ)

అని యిదివరకు ప్రసిద్ధమైనవచనాలనే తత్వంగా వనకుమారికర్తవ్రాస్తే మానవసుఖదుఃఖాలపై వీరిదృష్టి పెసిమిష్టికుగా వున్నదని ఆంధ్ర హెరాల్డులో ఒకరు సారంతేల్చారు. యీమాటల్లో వీరి నూతనానుభవంగాని వీరి స్వదృష్టిగానిలేదు. లోకంలో ప్రసిద్ధమైన వచనాలివి. జీర్ణించని పాశ్చాత్యసంస్కారంతో భారతీయసంస్కారానికి అంధులై వున్నంతకాలం ఇట్లాటివి గోచరిస్తుండగలవు. ఈకొత్త సంగతులు మనకు