పుట:Neti-Kalapu-Kavitvam.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్త్వజిజ్ఞాసాధికరణం

67

మీమాంసాసూత్రీయ శాబరభాష్యవ్యాఖ్యానమైన తంత్ర వార్తికంలో శిష్టచారవిచారంలో కుమారిల భట్టాచార్యులు

"సతాం హి సందేహపదేషు వస్తుషు
 ప్రమాణమంతఃకరణప్రవృత్తయః"( శాకుం)

అనే శాకుంతలవాక్యాలను గ్రహించారు. వైయాకరణసిద్ధాంత గ్రంథమైన వాక్యపదీయంలో భగవతిప్రతిభయే వాక్యార్థమని నిరూపించే ఘట్టంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః మనుపశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తే తిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

అనే కారికకు వ్యాఖ్యవ్రాస్తూ, హేలారాజు "సతాంహి" అనే పై వాక్యాలనే స్వీకరిస్తాడు.

హంస యోగిభాష్యమనే గీతాభాష్యంలో
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనం". (కుమా)

అనే కుమారసంభవవాక్యాలు హంసయోగి స్వీకరించాడని శుద్ధధర్మ మండలి కార్యదర్శి చెప్పగా విన్నాను. ఈతీరుగా ఆకాలపు తత్వజిజ్ఞాసలకు బలం ప్రసాదించిన కాళిదాసాదులు తత్వజ్ఞత్వసంబంధం కలిగే లో కోత్తరులై వున్నారు.

శంకరులు - నూతనశకం

అయితే శ్రీశంకరులకాలంనుండి భారతవర్షంలో తత్వజిజ్ఞాసలకు ఒక నూతనశకం ప్రారంభమయింది. భారతంనుండి భగవద్గీత వేరైంది. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, గీతకు భాష్యాలు వ్రాసి భారతవర్షపుమూలమూలల అగణ్యశిష్యులతో సంచారం చేసి తత్వజిజ్ఞాసలను వెదచల్లినాడు. అదివరకే శాస్త్రంగా ఆరంభమైవున్న బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండశాస్త్రమై అదే అనేకసంవత్సరాల పఠనానికి తగిన ఒకప్రసిద్ద విద్యాస్థానమయింది. శంకరాచార్యులకాలంనుండి బ్రహ్మజిజ్ఞాస ఒక అఖండవిద్యాస్థానమై దేశంలోవున్న మహామేధావంతు లనందరినీ ఆకర్షించ మొదలుపెట్టింది. బుద్ధుడితో కదలిక ఆరంభమైన యీజిజ్ఞాసలకు శంకరాచార్యులచేతిలో మహోచ్చదశ ప్రాప్తించింది.