57
తృతీయాశ్వాసము
గీ. | మునితిలకుఁ డంతట నమోఘ మనుకులీన, మార్గణ నిరుద్ధ సౌవర్గమార్గుఁ డయ్యె | 153 |
వ. | అంత సంక్రాంతం బైనజామదగ్న్యశక్తిసంపత్తిచే సంపన్నుండును పన్నగపరిబృఢభోగసాభోగభుజాభిరాముండు నగురాము నాలింగనంబు సేసి మూర్ధంబు నాఘ్రాణించి దశరథుండు కఠితురగపురస్సరరథుం డై పరిఘయుంబలెఁ బరిసరంబునం బ్రవహించు సరయూతరంగిణిచేఁ బరీతం బగు సాకేతంబును సదారు లైనదారకుల సాదరంబుగా నవలోకించు పౌరపురంధ్రుల నీరంధ్రితగవాక్షంబు లగుకటాక్షంబులచేఁ బింఛాతపత్రాయమాణధవళాతపత్రుం డగుచుం బ్రవేశించె. | 154 |
ఉ. | సారతరత్రపాభరవశంబున గూఢమనోజవిక్రియా | 155 |
మ. | కుటిలారిద్విరదావళీవిదళనక్రూరాసి[1]పారీంద్ర కై | 156 |
క. | అనుదినసురభిస్రక్చం, దనఫలదానక్రియాభినందితనానా | 157 |
మాలిని. | మదనజనకరూపా మంజుధర్మానులాపా! | 158 |
గద్యము. | ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకర సుధాకర జగద్విఖ్యాత కవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతం బైన చంపూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము. | |
ఇది బాలకాండము.
- ↑ పారీంద్రము = పాము-సింహము