పుట:Chanpuramayanam018866mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరస్తు

చంపూరామాయణము

చతుర్థాశ్వాసము

అయోధ్యాకాండము

క.

శ్రీ వెల్లంటి కులాధిప, సౌపస్తిక విప్రభక్తిసంపన్నమనీ
షావిర్భావ నిషేవిత, కావేరినృపాలచంద్ర కసవనరేంద్రా.

1


చ.

పరదురవాపబాహుబలభాస్వరుఁ డుత్తరకోసలావనీ
శ్వరుఁడు శచీశ్వరుం దెగడువైభవ మొప్ప ధరిత్రి యేలుచున్
భరతుని లక్మణాపరజుఁ బంచె ముదంబునఁ గైకయీతలో
దరికి సహోదరుం డగుయుధాజిదిలాధిపురాజధానికిన్.

2


దశరథుఁడు రామునకుఁ బట్టాభిషేకము చేయఁ దలఁచుట

శా.

అంత న్విశ్వభరస్వయంవహభుజోదంతు న్విదేహాత్మజా
కాంతుం గోసలమాత్రధాత్రికిఁ బతిం గావింప రా జాత్మలోఁ
జింతించెన్ జగ మెల్లఁ దాల్పఁగల జేజేగట్టువజ్రీని నై
శాంతస్తంభధురంధరత్వ మెనయించంబూనుచందంబునన్.

3


క.

చింతించి తనదుకోరికి, మంత్రుల కెఱిఁగించి గురుసమావనయశ్రీ
మంతు లగునాగరకధీ, మంతులఁ బిలిపించి పలికె మధురతరోక్తిన్.

4


సీ.

ఆచక్రవాళక్షమాచక్రధౌరేయు లాజన్మశుద్ధవృత్తానపాయు
లాచండకిరణాజహదఖండభుజశౌర్యు లామనుస్థిరతరన్యాయధుర్యు
లాపురందరగోపకోపపాదితవార్తు లాబ్రహ్మభువనవిఖ్యాతకీర్తు
లాస్థాణునారాయణాస్థానమృతదాను లాకకుత్స్థపరిస్ఫుటాపదాను


గీ.

లైనమాపెద్దలచరిత్ర మతివిచిత్ర, మనుచుఁ గొనియాడుకొనఁ జెల్ల దందుకెల్ల
షష్టిసాహస్రకములు మజ్జనకు వెనుక, రక్షణముగన్న మీరెపో సాక్షు లెన్న.

5


క.

వేదము మీయంగీకృత, వాదము లోకత్రయానివారితనిజమ
ర్యాదము గావున నది యౌఁ, గాదనరు గదా నిజంబు గాఁ దనరుఁ గదా.

6


సీ.

దోషాచరీహారదూరీకృతి ఘటించు నతిరథత్వమునను నాఁపశాక
ఖలనృపాలకళత్ర ఘనసారచర్చఁ బోనిడు హేతివాడిమి నడఁగఁబోక