పుట:Annamacharya Charitra Peetika.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

89 సంవత్సరపురాబడి 620 గట్టివరహాలు. ఈసొమ్ముతో జరపవలసిన ధర్మకైంకర్యము లలో మన కిక్కడ ముఖ్య మయినవి : 1 వైశాఖమాన విశాఖానక్షత్రమున తాత అన్నమయుగారి జన్మనక్షత్రోత్సవకైంకర్యము. 2 చైత్రమాసము మృగశిరనక్షత్రమున పెదతిరుమలయ్యగారి జన్మ నక్షత్రోత్సవకైంకర్యము. 3 వూవుశుద్ధ చతుర్థి తవు పెదతండ్రి నర నయ్యగారి శ్రాద్ధదినకైంకర్యము. 4 జ్యేష్ఠమాసపూర్వపక్షచతుర్థి తనయన్నగా రగుతిరువెంగళప్ప శ్రాద్ధదినకైంకర్యము. 5 ఆశ్వయుజమాన బవూుళ త్రయోదశి తమతల్లిగారైన తిరుమలమ్మగారి శ్రాద్ధదినకైంకర్యము. వీనివల్ల నన్నమాచార్యాదుల జన్మమాననక్షత్రములు నిర్వాణ మాసతిథులు తెలియ నయినవి గాని వానిసంవత్సరనామములుతెలియ రాకుండట కొఱఁత గొల్పుచున్నది. ఒక్కయున్నవూ చార్యునివే జనననిర్యాణసంవత్సరములు తెలియువచ్చినవిగావి తక్కినవారివి తెలియురాలేదు. సూర్యచంద్రాదు లున్నందాఁకఁ బైవారిజన్మనక్షత్ర నిర్యాణతిథికైంకర్యములు సాగుచుండుటకే యాయగ్రహారసమర్పణములు జరగినవి గాని యాధర్మకైంకర్యములకు "శ్రీవైష్ణవులరక్ష" అనిమాట కలదుగాని అన్నీ అన్యథా అయిపోయినవి. పరమాచార్యుఁడయిన యన్నమాచార్యనిజన్మనక్షత్ర నిర్యాణతిథి కైంకర్యములను స్వామి కనేకా గ్రహారముల నొసగి యనేకకైంకర్యములు జరసిన మహావిద్వాంసుడు మహాకవి యగు తిరుమలాచార్యుని నిర్యాణదినకైంకర్యములు నయిన నిఁకమీఁద సాగుట యర్ధింపఁదగినది. అష్టమహిషీకళ్యాణము పరమోగివిలాసము ఉషాపరిణయము అన్నమాచార్య చరిత్రము చిన్నన్న రచించిన గ్రంథములు. ఈతఁడు జలజాత వాసిని చనుబాలపష్టిచే కవితారచన నేర్చినాఁడట. ఈతని యన్న