90 పెదతిరువెంగళనాథుఁడు 'సంగీతసత్కవిత్వాధికుఁడు' సంకీర్తనములు పాడుచుండు నవ్పడు స్వామి యూడుచుండెడువాఁడట. ఈమహామహులకు (అయిదు గురుకు) నప్పడు స్వామి పాండవులకుఁ గృషునట్లు సహాయమై యుండెడివాఁడట! వీరికి విచిత్రముక్తాత పత్రరత్నకిరీట ముద్రికా ప్రచండమణిమండిత మకరకుండలోత్కరాహః కరదీపికాపాదుకాది బహూకరణంబులను స్వామి కరుణించెనట! చిన్నన్న పరమయోగివిలాసాష్టమహిషీకళ్యాణములలో రత్నశుంభదనుపమ శ్రీవేంకటాద్రీశదత్తమకరకుండలరత్నమండితకర్ణుఁడనని, కావ్యంబు చెప్పి శ్రీవేంకటేశు మెప్పించి సకలంబు నెఱుఁగ నసాధారణాంక మక రకుండలములు గొన్నవాఁడ నని దినములోననె వేయిద్విపద లింపొంద వినుతవర్ణనలతో విరచించువాఁడ నని చెప్పకొన్నాడు. ద్విపదలక్షణము నీతడే నిష్కృష్టముగా నిర్వచించినాఁడు. లక్షణగ్రంథకారు లెవ్వరుగాని యితనివలె నిర్వచింపఁజాల రయిరి. ఈతఁడు. కస్తురివీణఁ గోసినకరణి తెలిగప్పరపుఁగ్రోవి దెఱచినసరణి విరవాదిపొట్లంబు విడిచినమాడ్కి పరిమళించుచుఁ గవుల్ బళిబళీ యనఁగు కవిత సెప్పినసులక్షణకవి. అర్వాచీనులు కొందఱు ‘తాళ్ళపాక చిన్నన్న దండెమీటులుగావు' అనీ అల తాళ్ళపాక చిన్నన్న రోమము లైతె తంబురాదండెకుఁ దంత్రులౌనె అనీయీతని గొప్పగాయకునిఁగా స్మరించిరి. చిన్నన్న గాయకుఁ డనుట కిక్కడి రాగిరేకులలోఁగాని గ్రంథములలోఁగాని యూధారములు గానరావు. చిన్నన్నకు అన్న తండ్రి తాత గొప్పగాయకులు గాన యిటీవలివారు గ్రంథములఁబట్టి చిన్నన్ననే యెఱిఁగినవారుగాన వారియోగ్యత నీతనికిఁ జేర్చి చెప్పియుండవచ్చును. కాక యీతఁడును గాయకుఁడేమో! గణపవరపు వెంకటకవి ప్రబంధరాజమున చిన్నన్న నిటు నన్నుతించెను: š. ఎన్నఁ దెనుఁగునకు రాజను గ్రన్నన యతిరాజునకును రమణయకును నేఁ జిన్నను ద్విపద నొనర్చను జిన్నన్నను బిరుదుగద్య చెప్పినఘనుఁడన్,
పుట:Annamacharya Charitra Peetika.pdf/92
Appearance