పుట:Annamacharya Charitra Peetika.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 మంగాపురమున కళ్యాణవేంకటేశ్వర దేవాలయ జీర్ణోద్ధారణము గావించినాఁడు. స్వామి దివసుందరమంగళ విగ్రహమునుగూడ నీతఁడే క్రొత్త వెలయింపించిన టున్నాఁడు. ఆళ్వారుతో భాష్యకార్లతో దేశికులతో సహ తన తాతగారగు అన్నమాచార్యువిగ్రహము నక్కడ ప్రతిష్టించినాఁడు. కాని యావిగ్రహము నేఁడు గానరాకున్నది. పెదతిరువెంగళనాథుఁడు ఈతఁడు సాత్త్వికశుభమూర్తి, సంగీతసత్కవిత్వాధికుఁడు నని చిన్నన్నచే స్తుతింపఁబడెను. స్వామి సన్నిధి నీతఁడు సంకీర్తనములు పాడుచుండఁగా స్వామి యాడుచుండెడువాఁడట! వెంకటాచార్యుఁడు "విశేషించియు నత్తిరు వెంగళనాథుండు సంకీర్తనంబుఁ బాడిన నాడందొండండె."నని చెప్పినాఁడు. ఈతఁడు. చిన్నన్న జీవించియుండఁగా క్రీ 1546 పూర్వమే దివ్యధామ మందినాఁడు. చిన్నన్న ఈతఁడే అన్నమాచార్యచరిత్రకర్త చినతిరుమలాచార్యున కీతఁడు వునాఁడవ తమ్ముఁడు. ఈంుర్వురనడువు అన్నమయు యుని పెదతిరువెంగళనాధుఁ డనీ యిద్దరు సోదరులు. చిన్నన్నతర్వాత తమ్ముడు కోనేరునాథుఁడు - వీ రందఱును సుప్రసిదులు. కోనేరునాథుఁడు 1560 తర్వాతఁగూడ నున్నాఁడు. తాళికోట యుద్ధమును విద్యానగర వినాశనమును జూచుచౌర్భాగ్యమునకుఁబాల్పడక 1565 పూర్వమే వీ రందఱు దివ్యధామ మందియుందురు. ధర్మకైంకర్యములు స్వామి కీతఁడును జాల ధరకైంకర్యము లొనర్చెను. అందొకటి:క్రీ. 1546 లో కొండవీటిసీమలోని చెందలూరు మల్లవర గ్రామములను స్వామి శ్రీభండారమున కర్పించెను. రెండు గ్రామములనుండి 1. శకుంతలా పరిణయ కృత్యవతరణిక,