Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

సంవత్సరపురాబడి 620 గట్టివరహాలు. ఈసొమ్ముతో జరపవలసిన ధర్మకైంకర్యము లలో మన కిక్కడ ముఖ్య మయినవి :-

1 వైశాఖమాస విశాఖానక్షత్రమున తాత అన్నమయగారి జన్మనక్షత్రోత్సవకైంకర్యము.

2 చైత్రమాసము మృగశిరనక్షత్రమున పెదతిరుమలయ్యగారి జన్మనక్షత్రోత్సవకైంకర్యము.

3 మాఘశుద్ధ చతుర్థి తమపెదతండ్రి నరసయ్యగారి శ్రాద్ధదినకైంకర్యము.

4. జ్యేష్ఠమాసపూర్వపక్షచతుర్థి తనయన్నగా రగుతిరువేంగళప్ప శ్రాద్ధదినకైంకర్యము.

5 ఆశ్వయుజమాస బహుళ త్రయోదశి తమతల్లిగారైన తిరుమలమ్మగారి శ్రాద్ధదినకైంకర్యము.

వీనివల్ల నన్నమాచార్యాదుల జన్మమాసనక్షత్రములు నిర్వాణ మాసతిథులు తెలియ నయినవి గాని వానిసంవత్సరనామములుతెలియరాకుండట కొఱఁతగొల్పుచున్నది. ఒక్కయన్నమాచార్యునివే జనననిర్యాణ సంవత్సరములు తెలియువచ్చినవిగాని తక్కినవారివి తెలియరాలేదు. సూర్యచంద్రాదు లున్నందాఁకఁ బైవారిజన్మనక్షత నిర్యాణతిథికైంకర్యములు సాగుచుండుటకే యాయగ్రహారసమర్పణములు జరిగినవి గాని యాధర్మకైంకర్యములకు “శ్రీవైష్ణవులరక్ష" అనిమాట కలదుగాని అన్నీ అన్యథా అయిపోయినవి. పరమాచార్యుఁడయిన యన్నమాచార్యనిజన్మనక్షత్ర నిర్యాణతిథి కైంకర్యములను స్వామి కనేకాగ్రహారముల నొసఁగి యనేకకైంకర్యములు జరపిన మహావిద్వాంసుడు మహాకవి యగు తిరుమలాచార్యుని నిర్యాణదినకైంకర్యములు నయిన నిఁకమీఁద సాగుట యర్థింపఁదగినది.

అష్టమహిషీకళ్యాణము పరమోగివిలాసము ఉషాపరిణయము అన్నమాచార్య చరిత్రము చిన్నన్న రచించిన గ్రంథములు. ఈతఁడు జలజాత వాసిని చనుబాలపుష్టిచే కవితారచన నేర్చినాఁడట. ఈతని యన్న