పుట:Annamacharya Charitra Peetika.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 అన్నమాచార్యుని నాఁట సంకీర్తనములు తాటియాకులమీఁద వ్రాసియుంచఁబడెనేమో! ఆతని తర్వాత పెదతిరుమలాచార్యుఁడు వానిని రాగి రేకులమీఁదఁ జెక్కించెను. రాగివిలువయు, చెక్కించుకూలియు నిప్పటిలెక్క ప్రకారము లక్షలగును. ఒకరో యిద్దరో అక్షరములఁ జెక్కువారగుచో నదియొక పురుషాయుషమునంతకాలము జరపినఁ దేల వలసినవనియగును. రాగితే కులను జెక్కినవాఁడు-అన్నమరాజు తిమ్మయ్య అని కొన్ని తేకులమీఁద నున్నది. పెదతిరుమలాచార్యుని తర్వాత చినతిరుమలాచార్యుని సంకీర్తనములుకూడ రాగితేకులకెక్కినవి. 1540లో సంకీర్తనభండారము దగ్గఱ సేవచేయు వైష్ణవు లిర్వు రుండుట, సంకీర్తనములు పాడేవారు కొంద అుండుట, కైంకర్యములు దీపారాధనలు జరుగుచుండుటయు తాళ్ళపాకవారి శిలా శాసనముల కెక్కి యున్నవి.’ ఈ సంకీర్తనభండారము (తాళ్ళపాకవారి అర) ద్వారమున కిరు ప్రక్కలనే విగ్రహము లున్నవి. అవి యన్నమాచార్య తిరుమలాచార్యు లివి. చినతిరుమలయ్యు ఈతఁడు పెదతిరుమలయ్య పెద్దకుమారుఁడు. అనమాచార్యుఁ డి తనికి బ్రహె్మూపదేశము (ఉవనయువు) చేసెను. ఇందుకు సంకీర్తనము: භාවිද් తాళ్ళపాకాన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమె శ్రీహరిఁ గన వెర వానతిచ్చితివి |పల్లవి గురుఁడవు నీవె సుమ్మీ కుమతి నైననాకు ! సరవి బ్రహె్మూపదేశము సేసితి | 1. చూ, తిరుపతి దేవస్థానం శాసనము నెం 144 నెం.4 వాల్యుం. 12