Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87


పరమబంధుఁడ వైనా పరికింప నీవే సుమ్మీ।
వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి ॥తా॥1

తల్లి వైన నీవే సుమ్మీ తగినవిషయాలలో।
ప్రల్లదానం బడకుండా బ్రదికించితి ।
అల్లుకొని తోడునీడ వైనా నీవే సుమ్మీ।
చిల్లర మాయలలోనఁ జెడకుండాఁ జేసితి ॥తా॥2

ధాతవు నీవే సుమ్మీ తగుశ్రీ వేంకటనాధు।
నాతలఁపులో నిలిపి నమ్మంజేసితి ।
యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవే।
ఆతల నీతల నన్ను నాచుకొని కాచితివి ॥తా॥3

చినతిరు. అధ్యా 7ఱేకు.


కాన యీతఁడు క్రీ 1495 ప్రాంతముల జన్మించినవాఁ డనుకొనవచ్చును. క్రీ. 1553 దాఁక నీతనిశాసనము లున్నవి. ఈతఁడు సంస్కృతాంధ్రములందు మహాకవి, మహావిద్వాంసుఁడు, అష్టభాషాకవి చక్రవర్తియని బిరుదుగలవాఁడు. తండ్రితాతలవలెనే ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలను రచించినాఁడు. తెల్గుసంకీర్తన లక్షణము, అష్టభాషా దండకము రచించినాఁడు (ఇవి ముద్రితములు చూ. తాళ్ళపాక1 వాల్యుం)


శ్రీవెంకటేశ్వరస్వామికి దిగువ తిరుపతిలో వేల్పులకుఁ గూడఁ జాలా కైంకర్యములు కావించినాఁడు. అందు ముఖ్యములు గొన్ని:


గోవిందరాజస్వామికి, పెండ్లి తిరునాళ్ళు (వైవాహికోత్సవము) జరుపుటకు నేడియం అనుగ్రామము రాఁబడిలో సగమిచ్చినాఁడు.


గోవిందరాజ విట్టలేశ్వరాచ్యుతపెరుమాళ్ రఘునాథ వరదరాజ లక్ష్మీనారాయణులకును హనుమదాలయములోఁ దాను ప్రతిష్ఠించిన నరసింహస్వామికిని కైంకర్యములకై చిత్రిచిత్రానక్షత్రమునఁ దన తిరునాళ్ళలో వైశాఖమృగశిరను దనతండ్రి తిరునాళ్ళలో గోవిందరాజస్వామి గుడిదగ్గఱి సుదర్శన చక్రమునకుఁ గైకర్యములకై 200 రేఖై పొన్నుల రాబడిగల వెదుమప్పాకం గ్రామము నర్పించినాఁడు.