85
ఖేదంబుమాన్పిన కృష్ణమాచార్యు ఘనతరపంచమాగసార్వభౌము! ననఘు శ్రీతాళ్ళపాకాన్నమాచార్యుఁ దలఁచి" అనియు "ఉరుయోగసామ్రాజ్యవిభవ జనకుండు తిరుమలాచార్యవర్యుండు। వేదాంతవిద్యాప్రవీణుఁడై యంధ్ర వేదాంతమొనరించి, ద్విపదరూపమున హరివంశకావ్య మాయతనస్ఫూర్తి హరివంశమిగురొత్త ననువొందజేసి" అనియు నాంధ్రవేదాంత కర్తలసన్నుతిగలదు.
ద్రవిడమున వేదవేదాంతములను పరాకుంశయోగి మొదలగు నాళ్వార్లు ద్రావిడీకరించి ద్రావిడాగమసార్వభౌము లనిపించుకొనఁగా తెలుఁగున కృష్ణమాచార్యుఁడు:- కృష్ణమాచార్యనంకీర్తనకర్త, అన్నమాచార్యుఁడు:- సంకీర్తనాచార్యుడు, సంకీర్తనకర్త, పదకవితా పితామహుఁడు. పెదతిరుమలాచార్యుడు:- సంకీర్తనాదికర్త.
ఇట్లీవుువ్వురును వేదమును తెనుఁగుగావించి అంధ్రవేందాతకర్తలని పంచమాగసార్వభౌములని పంచమాగచక్రవర్తులని యనిపించుకొనిరి.
తిరుమలయ్యకు శ్రీమద్వేదమార్గ వ్రతిష్ఠాపనాచార్య శ్రీరామానుజసిద్ధాంతస్థాపనాచార్య వేదాంతాచార్య కవితార్కికకేసరి శరణాగతిజ్రపంజరబిరుదములు గలవు.
ఈతనికి వేంకటేశ్వరస్వామి త్రిపురుషపర్యంతము ప్రత్యక్షంబును సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చెనట![1]
సంకీర్తనభండారము
ఈ పెదతిరుమలయ్యగారే సంకీర్తన భండారమునకుఁ బెంపువెలయించిరి. తొలుత అన్నమాచార్యుఁడే సంకీర్తన భండారమును నెలకొల్పిన ట్టున్నాఁడు. అందకుఁ దార్కాణగా సంకీర్తనము. (పుట. 263)
- ↑ చూ. శకుంతలాపరిణయము. పీఠిక.