84
పెదతిరుమలయ్య గారు చేయించిన యుత్సవ విశేషములు సమగ్రముగా వ్రాసిన నదియే పుస్తకమగును.
ఈతఁడు రచించిన గ్రంథములు:-
1 శృంగారసంకీర్తనములు.
2 ఆధ్యాత్మ సంకీర్తనములు
3 వైరాగ్యవచనగీతాలు
4 శృంగారదండకము
5 చక్రవాళమంజరి
6 శృంగారవృత్త శతకము
7 వెంకటేశ్వరోదాహరణము
8 నీతిసీసశతకము
9 సుదర్శనగడ
10 రేఫఱకారములు.
11 భగవద్గీత తెల్గువచనము
12 ద్విపదహరివంశము
13 ప్రభాత స్తవము
పై వానిలో కడపటి రెండు ముద్రితములుగాలేదు. తొలిరెండింటిలోఁ గొంతభాగమును, గడమవి సమగ్రముగాను
ముద్రితములయినవి. హరివంశము దొరకనే లేదు.
ఇవిగాక చిన్నన్న పేర్కొన్న యంధ్రవేదాంతము తొలుత కృష్ణమాచార్యుఁడును తర్వాత తనతాత యన్నమాచార్యుఁడును పిదప తనతండ్రి తిరుమలాచార్యుఁడును ననుక్రమముగా రచించినది. సంకీర్తనాత్మకము. ఇ ట్లనుటకు సాధకముగా అష్టమహిషీ కల్యాణములోన నిట్లున్నది. "క్ష్మానుతద్రావిడాగమసార్వభౌములై। న మావారలనాళువారలను వేదంబులెల్ల ద్రావిడముగాఁజేసి వేదాంతవిదులు గోవిదులునైనట్టి గురుతరులకు పరాంకుశ ముఖ్య యోగివరుల" నని ద్రవిడవేదాంతకర్తల సన్నుతిపై “వనజాతజాత సర్వసురేంద్రముఖులు| గనలేని వెంకటగ్రావాధినాథు। పదముల శోభనా స్పదములౌ తనదు। పదముల బహుదేశపదము జనులఁ గనఁ జేసిపంచమాగమస్వారభౌముఁ డనఁబ్రసిద్ధకినెక్కియఖిలవిద్యలను। నన్నయాచార్యుండెయనఁ దాళ్ళపాక యన్నయాచార్యుఁడాయతకీర్తిఁజెలఁగె” “వేదంబు తెనుఁగుగావించి సంసార