86 అన్నమాచార్యుని నాఁట సంకీర్తనములు తాటియాకులమీఁద వ్రాసియుంచఁబడెనేమో! ఆతని తర్వాత పెదతిరుమలాచార్యుఁడు వానిని రాగి రేకులమీఁదఁ జెక్కించెను. రాగివిలువయు, చెక్కించుకూలియు నిప్పటిలెక్క ప్రకారము లక్షలగును. ఒకరో యిద్దరో అక్షరములఁ జెక్కువారగుచో నదియొక పురుషాయుషమునంతకాలము జరపినఁ దేల వలసినవనియగును. రాగితే కులను జెక్కినవాఁడు-అన్నమరాజు తిమ్మయ్య అని కొన్ని తేకులమీఁద నున్నది. పెదతిరుమలాచార్యుని తర్వాత చినతిరుమలాచార్యుని సంకీర్తనములుకూడ రాగితేకులకెక్కినవి. 1540లో సంకీర్తనభండారము దగ్గఱ సేవచేయు వైష్ణవు లిర్వు రుండుట, సంకీర్తనములు పాడేవారు కొంద అుండుట, కైంకర్యములు దీపారాధనలు జరుగుచుండుటయు తాళ్ళపాకవారి శిలా శాసనముల కెక్కి యున్నవి.’ ఈ సంకీర్తనభండారము (తాళ్ళపాకవారి అర) ద్వారమున కిరు ప్రక్కలనే విగ్రహము లున్నవి. అవి యన్నమాచార్య తిరుమలాచార్యు లివి. చినతిరుమలయ్యు ఈతఁడు పెదతిరుమలయ్య పెద్దకుమారుఁడు. అనమాచార్యుఁ డి తనికి బ్రహె్మూపదేశము (ఉవనయువు) చేసెను. ఇందుకు సంకీర్తనము: භාවිද් తాళ్ళపాకాన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమె శ్రీహరిఁ గన వెర వానతిచ్చితివి |పల్లవి గురుఁడవు నీవె సుమ్మీ కుమతి నైననాకు ! సరవి బ్రహె్మూపదేశము సేసితి | 1. చూ, తిరుపతి దేవస్థానం శాసనము నెం 144 నెం.4 వాల్యుం. 12
పుట:Annamacharya Charitra Peetika.pdf/88
స్వరూపం