పుట:Annamacharya Charitra Peetika.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

121 ప్రతీకమును జదివి యిది కూడదొరకిన బాగుగాదాయనఁగా ఇదిగో యిప్పడే యిట్టి సంకీర్తనమును జదివితిరి అని యాత డంతలోనే దానినెత్తియిచ్చెను. ఇటునాలుగు మూఁడు నాళ్ళలోనే మాకుఁగావలసిన సంకీర్తనము లెన్నో పుటపుట దొరకసాగినవి! అందు ముఖ్యములఁ గొన్నింటినీ పీఠికలో వెల్లడించితిని. ఇటు సంకల్పసిద్ధి సంతోషములతో పీఠిక రచించుచు దేవస్థానశాసనములలో మంగాపురమున తాళ్ళపాక చినతిరుమాచార్యుఁడు కట్టించిన కల్యాణ వెంకటేశ్వర దేవాలయమున అన్నమాచార్యునివిగ్రహపుఁ బ్రతిష్టయు జరిగిన టుండుటచే నదికల దేమోయని బరిశీలింపఁబోఁదలచి మిత్రులతో ముచ్చటించితిని. మహమ్మ దీయ విప్లవముచే పాడుపడి విగ్రహములు విరిగి సర్వధ్వంసమై యున్న యీ దేవళమునొక పుణ్యపురుషుడు (సుందరరాజురాయస్వామి) స్వప్నొద్బో ధము వలన వెదకి వచ్చి చేరి చాల శ్రమపడి తిరుపతి కొండమీది దివ్య మంగళ మూర్తివలెనే మహనీయమై దర్శనీయమైయున్న యక్కడి మూల మూర్తిని చక్కఁజూచుకొని పూజాపురస్కారములు ఉత్సవాదులు కొలఁది యేండ్లనుండి జరపుచున్నట్లును, వా రప్పడు తిరుపతిలోనే ఉన్నట్టును తెలియవచ్చెను. వారితో మిత్రులతో మూలమూర్తిని దర్శించి మాట మాటమీద తాళ్ళపాకవారి విషయమెత్తగా తాళ్ళపాకవారిదేవతార్చన విగ్రహాదు లిక్కడికిఁ జేరిన వని వారొక పెద్దకథ చెప్పిరి వానినెల్లఁ జూపిరి, అందు అన్నమాచార్యునినాఁటి భజనచిఱుతలు, తులసితావళము, స్ఫటికహారము సాలగ్రామములు శ్రీవేంకటేశ్వర, తద్దేవ్యాదుల దేవతార్చన విగ్రహములు ఆవిగ్రహముల యిత్తడి మకరదోరణము. వెండిఛత్రములు మొదలగునవి యున్నవి. వానిని శ్రీతాళ్ళపాక సూర్యనారాయణయ్యగా రొసఁగి రని వా రిప్పడు తిరుపతిలోనే ఉన్నారని యాసత్పురుషుఁడు తెలియఁజెప్పెను. పరమానందముతో తిరుపతికిఁ దిరిగి వచ్చి యా శ్రీసూర్యనారాయణయ్యగారిని గలసికొంటిని. వారే అన్నమాచార్య చరిత్రమును శ్రీ తిరుపతి వేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమునకు ఇచ్చిన వారు. కడపజిల్లా మడితాడును బీదరికముచే విడనాడి అన్నమాచార్యాదు లర్చించిన దేవతావిహ్రములను సరిగా నర్చింపననువు పడక తిరుపతిలో