పుట:Annamacharya Charitra Peetika.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

120 కళ్యాణోత్సవాలు జరిపించు వారునై ప్రజలు, ప్రభువులు, మహారాజులు తండోప తండములుగా తిరుపతికి రాకపోకలు జరపసాగిరి. భారతదేశమున నెక్కడగాని ప్రజలు తమకుఁ జేర్వైయున్న దేవాల యార్చామూర్తుల పేళ్ళ బెట్టుకొనుటకలదు. కాళహస్తీశ్వరుడు, వరదరాజు, మల్లికారునుఁడు, పానకాలరాయుఁడు ఇత్యాదినామములు దాల్చినవా రాయూపుణ్య క్షేత్రములచేరిక గ్రామములవారని తెలివిడికలుగును. కాని వెంకటేశ్వర వెంకటాచలపతీత్యాది నామములు దక్షిణాపథమందెల్ల నూరూర నింటింట సర్వసామాన్యమై వెలయసాగినవి. శ్రీతిరుపతి వెంకటేశ్వర.స్వామి పోలికగా ననేకప్రదేశము లలో వెంకటేశ్వర దేవాలయములు వెలసినవి. దక్షిణాపథదేవాలయము లలో శ్రీతిరుపతి వెంకటేశ్వరాలయమున కున్నంత యాదాయ మేదేవళమునకు నుండదు. విజయనగరరాజ్యము తర్వాత మట్ల మైసూరు తంజాపూర్యాది రాజ్యములు నేటిజమీందారీలు స్వామి కెన్నోకైంకర్య ములు జరపినవి. అవి నేఁడు ప్రజాస్వామ్యముచేఁ జిదికి పోయినను, పోవుచున్ననుగూడ శ్రీవెంకటేశ్వర వైభవము ప్రజాసామాన్యపరమై యుఖండమై యలరారుచునే యున్నది. అన్నమాచార్యచరిత్రవరిశోధనము ఈశ్వరసంకల్ప మెట్టిదోగాని తాళ్ళపాకవారి యధ్యాత్మసంకీర్తన ములు చదువుచుండునపుడు నా హృదయ తంత్రులలో ననురణనము సాగుచు పరమానంద పారవశ్యముకలుగుచు కర్తవ్యమేదో వ్యక్తమగుచున్న టుండును. ఈయన్నమాచార్యు చరిత్రము ముద్రించుచు నందు సాళ్వ నరసింహరాయని దగ్గఱ నన్నమాచార్యుఁడు పాడిన శృంగార సంకీర్తన ప్రతీకము చదివి ఈకథనిజమా? ఇట్టికీర్తనము దొరకఁ గలదా? ఉన్నను నది వేలకొలఁది సంకీర్తనములలో నెక్కడ నున్నదో కదా అనుకొనుచుఁ జేతనున్న తాళ్ళపాకశేషాచార్యులుగారి వ్రాఁతప్రతిని దెఱతునుగదా సరిగా నా సంకీర్తమే యందు నాకన్ను లెదురఁ గానవచ్చెను. ఆనందమాయెను. నాతో నిందు(బరిశ్రమించుచున్న చిరంజీవి శ్రీనివాసాచార్యున కిది చూపి చెప్పి మజొకసంకీర్తనము నంకెల విడిపించుకొనుటకుఁ బాడినదాని