Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 దేవుని సన్నిధి నర్పింపఁగోరి తెచ్చితి ననియు దమపూర్వులే కట్టించిన దేవాలయము పునరుద్దారము చెంది పూజాపురస్కారములుగలదై యున్నందుకు పరితోషించి యావిగ్రహములనెల్ల నక్కడనర్పించితి ననియు వారు చెప్పిరి. ఆనాఁ డెప్పడో యన్నమాచార్యుఁడు తనదేవతార్చన విగ్రహములు పోయినందుకు విలపించిన సంకీర్తనము తలఁపున గోచరించెను. (చూ పుట. 269) నా డాతని కవి మరలదొరకెనేమో దొరకినప్ప డెంత సంతోషించెనో ఏమిచేసెనో తెలియదుగాని యయిదువందలయేండ్ల తర్వాత నాతని భజనచిరుతులు తావళములు దేవతార్చన విగ్రహములు వెదకఁబోయినతీవ కాలఁదవిలినట్లే నాకన్నులెదుటగానవచ్చుట, వారు వెలయించిన దేవళము పూజాపురస్కారములతో మరల వెలయుట, చూడఁగా నాకుఁ బరమాపహ్లాదము గలిగినది. శ్రీయన్నమాచార్యుఁడు నిత్యనూరులతో నారదాది వుహరులతో నాళ్వారులతోఁగలసి శ్రీవేంకటేశ్వరస్వామి పుష్కరిణీతీరమున ఆకాశగంగా ఝారులలో దరులలో సూర్యమండలములో నిత్యానంద విహారము సల్పుచుండెనని యానాఁటి వా రానందించిరి. (చూ. పుట 295) అన్నమాచార్యుఁడు పరమప్రాప్యము శ్రీవేంకటేశ్వర సన్నిధానమేయని యనేకసంకీర్తనములలో గొంతెత్తి చేయెత్తి గొప్పగాఁ జెప్పకొనెను. ఆయన పరమపదమందిన ఫాలున బహుళ ద్వాదశి వ్రత్యాబ్దికశ్రాద్ధదినవుగాన యూతని కువూరుఁడు పెద తిరుమలాచార్యుడిటు తన తండ్రిగారి నాహ్వానించెను. శ్రీరాగం దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు జనకుండ అన్నమాచార్య విచ్చేయవే ||పల్లవి| అనంత గరుడముఖ్యులయిన సూరిజనులతో ఘననారదాది భాగవతులతో దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే |దినil 1