121
ప్రతీకమును జదివి యిది కూడదొరకిన బాగుగాదాయనఁగా ఇదిగో యిప్పుడే యిట్టి సంకీర్తనమును జదివితిరి అని యాత డంతలోనే దానినెత్తియిచ్చెను. ఇట్లునాలుగు మూఁడు నాళ్ళలోనే మాకుఁగావలసిన సంకీర్తనము లెన్నో పుటపుట దొరకసాగినవి! అందు ముఖ్యములఁ గొన్నింటి నీ పీఠికలో వెల్లడించితిని. ఇట్లు సంకల్పసిద్ధి సంతోషములతో పీఠిక రచించుచు దేవస్థానశాసనములలో మంగాపురమున తాళ్ళపాక చినతిరుమాచార్యుఁడు కట్టించిన కల్యాణవెంకటేశ్వర దేవాలయమున అన్నమాచార్యునివిగ్రహపుఁ బ్రతిష్ఠయు జరిగిన ట్లుండుటచే నదికల దేమోయని బరిశీలింపఁబోఁదలచి మిత్రులతో ముచ్చటించితిని. మహమ్మదీయ విప్లవముచే పాడుపడి విగ్రహములు విరిగి సర్వధ్వంసమై యున్న యీ దేవళమునొక పుణ్యపురుషుడు (సుందరరాజురాయస్వామి) స్వపోద్బోధము వలన వెదకివచ్చి చేరి చాల శ్రమపడి తిరుపతి కొండమీది దివ్యమంగళ మూర్తివలెనే మహనీయమై దర్శనీయమైయున్న యక్కడి మూలమూర్తిని చక్కఁజూచుకొని పూజాపురస్కారములు ఉత్సవాదులు కొలఁది యేండ్లనుండి జరపుచున్నట్లును, వా రప్పుడు తిరుపతిలోనే ఉన్నట్టును తెలియవచ్చెను. వారితో మిత్రులతో మూలమూర్తిని దర్శించి మాట మాటమీద తాళ్ళపాకవారి విషయమెత్తఁగా తాళ్ళపాకవారిదేవతార్చన విగ్రహాదు లిక్కడికిఁ జేరిన వని వారొక పెద్దకథ చెప్పిరి' వానినెల్లఁ జూపిరి. అందు అన్నమాచార్యునినాఁటి భజనచిఱుతలు, తులసితావళము, స్ఫటికహారము సాలగ్రామములు శ్రీవేంకటేశ్వర, తద్దేవ్యాదుల దేవతార్చన విగ్రహములు ఆవిగ్రహముల యిత్తడి మకరదోరణము. వెండిఛత్రములు మొదలగునవి యున్నవి. వానిని శ్రీతాళ్ళపాక సూర్యనారాయణయ్యగా రొసఁగి రని వా రిప్పుడు తిరుపతిలోనే ఉన్నా రని యాసత్పురుషుఁడు తెలియఁజెప్పెను. పరమానందముతో తిరుపతికిఁ దిరిగి వచ్చి యా శ్రీసూర్యనారాయణయ్యగారిని గలసికొంటిని. వారే అన్నమాచార్య చరిత్రమును శ్రీ తిరుపతి వేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమునకు ఇచ్చినవారు. కడపజిల్లా మడితాడును బీదరికముచే విడనాడి అన్నమాచార్యాదు లర్చించిన దేవతావిహ్రములను సరిగా నర్చింపననువు పడక తిరుపతిలో