82 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము
లక్ష్మ : ఏమివింత !
కార్ముకం బేడ యడవులఁ గాయగరుబు
పండ్లు గుడిచెడి జడదారి వటువులేడ?
బ్రహ్మకులమున రెండవ పరశురాముఁ
డవతరించెనె కేసరి హరిణి కటులు !
సేనా : యువరాజా, యాతఁడు సామాన్యతాపసబాలకుఁడుగాఁడు.
సౌందర్యశౌర్యముల్ సమభాగములు గాఁగఁ
బంచికొన్నవొ దేహ భావములను !
మునిబాలకత్వంబు భుజబల విక్రమం
బైకమత్యముతోడ నలరునవియొ!
అంగుళీ కిసలంబు లతుల శరాసనం
బవిరత స్నేహంబు నాసగొనెనొ!
శైశవంబును ధైర్య సాహసోద్ధతు లన్న
దమ్ముల యట్లుండఁ దలఁచెనొక్కొ !
కాక యన్యోన్యదూరత్వ కలనమెలఁగు
గుణములెల్లను నొకచోటఁ గూడి తాప
సార్భకాకారము సమాశ్రయంబుగొనునె?
యిట్టిచిత్రంబు సృష్టిలో నెందుఁగనము
లక్ష్మ : సేనానీ, ఆ తాపసవటువును జూచుటకు నామన మువ్వి