పుట:2015.392383.Kavi-Kokila.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 83

ళ్ళూరుచున్నది. అచ్చోటికి దారితీయుము.

సేనా : ఇదిగో యిటు.

[నిష్క్రమింతురు.]

_________

ద్వితీయ స్థలము : వనము.

_________

[కుశుఁడు ప్రవేశించును; గుఱ్ఱము కట్టఁబడియుండును.]

కుశు : ఈ ఋషీశ్వరు లెంత భీరులు? తాపసులు సవనాశ్వమును బట్టఁగూడదఁట !

                     బలము శౌర్యంబు గల్గిన భార్గవుండు
                     మునివరుఁడు గాక తక్కెనే? జనక తర్ప
                     ణంబునకు రాజకుల శోణితంబు జీవ
                     నదిగఁ బాఱింపలేదె యనంతధాత్రి?

చతురంభోధి పరీత భూవలయమున అయోధ్యాధీశుని యజ్ఞాశ్వమును బట్టు వీరపుంగవుఁ డొక్కఁడైన లేఁడఁట!

[లక్ష్మణుఁడు, సేనాని ప్రవేశింతురు]

సేనా : ఇదిగో! సవనాశ్వము. ఆతఁడే తాపసబాలకుఁడు.

లక్ష్మ : [స్వగతము] ఆహా! సేనాని వర్ణించినంతకన్న ఈయర్భకుఁడు వేయిమడుంగు లెక్కుడుగఁ బ్రకాశించుచున్నాఁడు! [ప్రకాశముగ]