పుట:2015.392383.Kavi-Kokila.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 81

                     వజ్రపాతంబునం గూలు వల్లివోలె
                     మూర్ఛవోయిన తరుకాండ మూల మిదిగొ !

              ఈ ప్రదేశము నేఁటికిని గుర్తింప సాధ్యమగుచున్నది.

                      జనకరాజేంద్ర పుత్రికోష్మల విషాద
                      బాష్పవారి ప్రవాహంబు పాఱిపాఱి
                      పచ్చపూరియు నిచ్చోటఁ బట్ట దకట !
                      పృథ్విశోకాగ్ని పరితప్త హృదయమనఁగ.

[నేపథ్యమున కలకలము.]

[ఆలకించి] ఏమి యీ కలకలము ?

[సేనానాయకుఁడు ప్రవేశించును]

సేనా : జయము జయము యువరాజునకు ! యజ్ఞాశ్వము బంధింపఁబడినది.

లక్ష్మ : [ఆశ్చర్యముతో] ఎవరు బంధించిరి?

సేనా : ఎవఁడో ఋషికుమారుఁడు.

లక్ష్మ : [ఆశ్చర్యముతో] ఋషికుమారుఁడా ? - తెలియక్ల కట్టి యుండును. సవనాశ్వమనిచెప్పి విడిపించుఁడు.

సేనా : మహాప్రభూ, సర్వవిధముల బోధించితిమి. నయ భయములఁ జెప్పితిమి. ఎంత బ్రతిమాలినను వినక ఆతాపస వటువు ముష్కరపుఁ బట్టు పట్టియున్నాఁడు. మేము బెదరించిన సరకుసేయక యెల్లిదమాడుచు శింజనీ టంకారము గావించు చున్నాఁడు.