హైందవ స్వరాజ్యము/పండ్రెండవ ప్రకరణము
పండ్రెండవ ప్రకరణము.
భారత భూమిస్థితి.
వైద్యులు.
చదువరి: వకీళ్లనుగురించి నాకిప్పు డర్థమయినది. వారు చేసిన మేలు ఆకస్మికము కావచ్చును. ఆవృత్తి నీచమని నాకు తోచుచున్నది. మీరు వైద్యులను కూడ లాగి వైచుచున్నారే! అదిఎట్లు?
సంపా: నేను తమకు తెలుపునభిప్రాయములు నావికావు. నేనును అంగీకరించినవే. పాశ్చాత్య రచకులు న్యాయవాదులను గురించియు వైద్యులను గురించియు కఠినతరముగా వ్రాసినారు.
హైందవ స్వరాజ్యము.
మన పై అధికారము నిలుపుకొనుటకు ఇంగ్లీషునారు వైద్య
వృత్తిని బహుచక్కగా వినియోగించినారు. రాజ కీయలాభమును
సంపాదించుటకు ప్రాచ్యఖండ వాసులగు సంస్థానాధీశ్వరులపట్ల
ఇంగ్లీషు వైద్యులు తమ వృత్తిని వినియోగించినట్లు నిదర్శనము
లున్నవి.
వైద్యులు మనబునాథులనే చెరపినారు. ఏమి రాని నాటు
వైద్యులే సున్నితులైన నేటి వేద్య శిఖామణులకంటే మెరుగని
నాకొకొకప్పుడు తోచుచున్నది. ఆలోచించి చూతము. దేహ
మును కాపాడు ట వైద్యునివృత్తి. సరిగనాలోచించిన నదియును
గాదు. దేహమును బాధించు రుజలను పోనాడుట వారినిధి. ఈ
రోగము 'లెట్ల కలుగుచున్నవి? నిజముగా మనయ జాగ్రత్తవలన,
మన విషయలోలత్వమువలన. నేనూరక తిన్నాను. అజీర్తికలిగి
నది. వైద్యుని కడకు పోయినాను. అతడుమందిచ్చినాడు. నాకు
బాగైనది. మరల ఇష్టముకొలది మెక్కినాను. మరల అజీర్తి య
యినది. 'మరల వైద్యుని చేతిమాత్రలు మ్రింగ వలసిన దే. మొదట
మాత్రలు మ్రింగనిచో నాకుతగిన శాస్తియగును. మరల మితి
మీరి తినను. అంతటితో అజీర్తి నిలిచి పోవును. వైద్యు డడ్డు
తగిలి నావిషయలోలత్వమును ప్రోత్సాహపరచినాడు. అందు
వలన దేహమేమో బాగుపడినది కాని నామానసముమాత్ర
ము, శక్తివిహీనమైనది. మందులూరక త్రాగుచుండిన మాన
71
భారత భూమిస్థితి : వైద్యులు.
.
నేనేదో తప్పుదారి తొక్కినాను. రుజ పై బడినది. వేద్యుడు బాగు చేయును. తరువాత సూటికి తొంబదితొమ్మిదిపాళ్లుమరల తప్పుదారి తొక్కు దుననుట నిశ్చయము. వైద్యుడు అడ్డ పడనిచో స్వభావానుగుణముముగ ఫలముక లిగియుండును. నేను సంరక్షించు కొనుశక్తి యలవడును, నాతప్పుదారి తప్పి యుండును, నాకు -సంతోషము కలిగియుండును.
ఆసుపత్రులు పాపమును పెంచునట్టి సంస్థలు. ఇవి కారణ
ముగా మనుష్యులు తమశరీరములను గురించి తక్కున జాగ్రత్త
గా నుందురు. కావున అవినీతి ప్రబలిపోవుచున్నది. ఐరోపి
యను డాక్టరులు అధములు. డేహమును సంరక్షించు
కొనుటను గురించి పొరపాటు అభిప్రాయము మనసులో
నిడుకొని వీరు సంవత్సరము సంవత్సరము వేస వేలు జీవములను
హింసించుచున్నారు. ఇది యే మతముకూడ అంగీకరించినది
కాదు. మన దేహములను సంరక్షించుకొనుటకు ఇన్ని జంతువులను
చంపనక్కర లేదని అందరును అంగీకరించుచునే యున్నారు.
ఈ డాక్టరులు మనమ తాభిమానమును చెడుపుచున్నారు వారి మందులలో ఎక్కువ వానియందు క్రొవ్వుగాని మత్తు ద్రనములు కాని కలియుచున్నవి. వీని రెంటిని హిందూమహమ్మ దీయమతములు రెండును నిషేధించినవి. నాగరకమను నాట
కము మనమాడవచ్చును. నిషేధితములన్నియు మూఢవశ్వా హైండవ స్వరాజ్యము.
సములని యాడవచ్చును. ఇచ్చవచ్చిన యనుభవములలో
నోలలాడవచ్చను. అయిన ఇందులో నిజమే మియందురా !
డాక్టరులు మనకీయనుభవములను పట్టించుచున్నారు. మనము
అత్మనిగ్రహము లేని వారమయినాము. పౌరుష విహీనత్వము
మనపాలైనది. ఈ కారణములచేత దేశ సేవచేయుటకు మనమన
ర్హులము. యూరోపియను నైద్యము నేర్చుకొనుట మన బాని
సత్వము దృఢతరము చేసికొనుటయే.
వైద్యవృత్తియేల అవలంబించుచున్నామో ఆలోచించుట
ఆవసరము. లోకమును సేవించన లెనని మాత్రము కాదు.
గౌరనము ఐశ్వర్యము పంపాదించుట కే మనము డాక్టరులగు
చున్నాము. అవృత్తిలో నిజమైన లోక సేవ యేమాత్రములే
దనియు దానివలన లోకమునకు అపకారమనియు చూపుటకు
నే నిదివరకు ప్రయత్నము చేసితిని. డాక్టరులు తమకు గొప్ప
జ్ఞానము కలయటు నటించి పెద్ద పెద్ద మొత్తములు లాగుదురు.
రెండుదమ్మిడీలు చేయనిమందును వారు రూపాయలురూపొ
యలు పెట్టి యమ్ముదురు, పిచ్చినమ్మకముచేత తమకు కల
రోగము కుదురునను భ్రమచేత ప్రజ ఈమందులను కొందురు.
ఇదంతయు చూడగా ప్రజాహితము నెంతయో నెత్తిన వేసికొను
నట్లు నటించు డాక్టగుల కంటె, మనయెరుకలో నుండునట్టి నాటు
వైద్యులే మేలుగారా ?